ఓవర్సీస్ కింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు

ఓవర్సీస్ మార్కెట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అమెరికా. అక్కడ తెలుగు వారు లక్షల్లో ఉన్నారు. అందుకే మన సినిమాలకు అక్కడ అంత ఆదరణ. ఇక టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. యావత్ సౌత్ ఇండియా నుంచే యు.ఎస్. లో ఎక్కువ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన చిత్రాల్లో నటించిన ఘనత సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం. మహేష్ బాబు నటించిన 11 సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ మార్కును దాటాయి.

మహేష్ బాబు తర్వాత అమెరికాలో ఎక్కువ మిలియన్ మూవీస్ ఉన్న రెండో కథానాయకుడు నేచురల్ స్టార్ నాని. లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’తో కలిపి నాని నటించిన 9 చిత్రాలు యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ మార్కును దాటాయి. ఈ లిస్టులో మూడో స్థానంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు. రజనీకాంత్ నటించిన 8 సినిమాలు అమెరికాలో 1 మిలియన్ మార్కును దాటాయి. ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, విజయ్ నిలిచారు. తారక్, పవన్, విజయ్ నటించిన ఏడేసి సినిమాలు యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్స్ మార్కును దాటాయి.

యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్స్ మార్కును దాటిన సినిమాల లిస్టులో ప్రభాస్, అల్లు అర్జున్ నటించిన ఐదేసి సినిమాలున్నాయి. మన సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వి కూడా నాలుగేసి సినిమాలు నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన లిస్టులో ఉన్నాయి.

Related Posts