4800 మంది అత్యాచార బాధితులను కాపాడిన మహిళ..!  సీతవ్వ కథ ఇదే..!!

4800 మంది అత్యాచార బాధితులను కాపాడిన మహిళ..!  సీతవ్వ కథ ఇదే..!!

ఆర్థిక అవసరం ఏ పనైనా చేయిస్తుంది.. కష్టపడితే గానీ తిండిదొరకని ఆరోజుల్లో ఆ పని తప్ప వేరే అవకాశం లేదు. ఇష్టం లేకపోయినా.. తప్పని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ఆ మురికి కూపంలోకి వెళ్లక తప్పలేదు.. కానీ కొన్ని రోజుల తరువాత వారి బతుకుల్లోకి వెలుగు వచ్చింది.. సాటి మహిళల కష్టాలు తెలుసుకున్న ఆమె వారిని ఎలాగైనా ఆ ఉచ్చులో నుంచి బయటపడేయాలని భావించారు. ఇందుకోసం ఉద్యమాలు చేశారు.. ఓ సంస్థను ఏర్పాటు చేసి బానిస బతుకుల నుంచి వారిని విడిపించేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఎలాగైతేనేం మొత్తానికి 4800 మహిళలను అత్యాచార బాధితుల నుంచి కాపాడారు. ఇదంతా గమనించి భారత ప్రభుత్వం అత్యాచార బాధితులను కాపాడేందుకు కృషి చేసి 'ఆమె'ను భారత ప్రభుత్వం గుర్తించింది.. పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇంతకీ ఏంటా కథ..?
 
కర్ణాటక రాష్ట్రంలో ఒకప్పుడు దేవదాసి వ్యవస్థ ఉండేది. అంటే కొందరు మహిళలు బడాబాబుల దగ్గర నిత్యం బానిసనలుగా ఉండేవారు. అయితే 1982లో కర్ణాటకలో దేవదాసి వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అయినా కొందరి ఆగడాలకు అడ్డుపడలేదు. చాటుమాటుగా ఇంకా దేవదాసి వ్యవస్థను కొనసాగించారు. ఇక కొన్ని ఇళ్లలో ఆర్థిక అవసరాల కోసం తమ తల్లిదండ్రులే దేవదాసిగా మారాలని ఒత్తిడి చేసేవారు. ఎందుకంటే వారికి ఆ కుటుంబానికి  కూడిపెట్టేది దేవదాసియే కనుక. మొత్తానిని దేవదాసిగా మారిన మహిళ నరకం అనుభవించేంది. 
 
కాలం మారుతున్న కొద్దీ మహిళలు చైతన్యవంతులవుతున్నారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతంలో దేవదాసిలుగా కొనసాగుతున్న వారిలో సీతవ్వ జోడట్టి ఇక ఈ అఘాయిత్యానికి తెరదించాలని అనుకుంది. ఈ తరుణంలో 1991లో కర్ణాటక మహిళా సంక్షేమం వారు చైతన్యపరిచారు. దేవదాసి వ్యవస్థపై అవగాహన కల్పించారు. దీంతో 1997లో ఆమె కొందరు మహిళలతో కలిసి 'మహిళా అభివృద్ధి మట్టు సంస్కరణ సంస్థే' (మాస్‌)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఉద్యమాలు చేశారు. అయితే వారికి ఎదరుదెబ్బలు తప్పలేదు. ఈ సంస్థను రద్దు చేయాలని  కొొందరి నుంచి తీవ్ర ఒత్తిడి కూడా వచ్చింది. అయినా భయపడకుండా ముందుకు సాగారు. మొత్తానికి మాస్‌ సంస్థ ద్వారా 4800 మహిళలు వారి పిల్లలను దేవదాసి ఉచ్చునుంచి కాపాడాం అని సీతవ్వ పేర్కొన్నారు.

RELATED NEWS

Comment