తిరుమల బూందిపోటులో అగ్నిప్రమాదం

తిరుమల బూందిపోటులో అగ్నిప్రమాదం

తిరుమల బూందిపోటులో అగ్నిప్రమాదం జరిగింది. బూంది తయారు చేసే సమయంలో బాగా వేడిగా ఉన్న బాండీలో నెయ్యి పోయడంతో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పోటు సిబ్బంది.. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే మంటలు వ్యాపించిన సమయంలో దట్టంగా పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల ఉన్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలిని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు పరిశీలించారు. బూందిపోటు సిబ్బంది నిర్లక్ష్యంపై జేఈవో శ్రీనివాసరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో బూందిపోటులో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పోటు సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

RELATED NEWS

Comment