అమ్మో బాలయ్య ఊరమాసే!!

అమ్మో బాలయ్య ఊరమాసే!!

నందమూరి బాలకృష్ణ సినిమాలు చేసే స్పీడు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆయన ఒక సినిమాకూ ఇంకో సినిమాకూ మధ్యన గ్యాప్ పెద్దగా తీసుకోడు. అప్పట్లో కేవలం తన 100వ సినిమాను ఓకె చేయడానికి బాగా గ్యాప్ తీసుకున్నాడు కాని.. ఆ తరువాత మరోసారి స్పీడు పెంచేశాడు. వరుసగా తన సినిమాలతో బాక్సాఫీస్ పై దండెత్తాలని చూస్తున్నాడు. 

ఈ ఏడాది ఆల్రెడీ తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అలరించిన బాలయ్య.. సెప్టెంబర్ 1న పైసా వసూల్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో ఒక డాన్ గా కనిపిస్తాడట. అయితే పూరి జగన్ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయిపోయింది. గుమ్మడికాయ కూడా బద్దలు కొట్టేశారు. ట్విస్ట్ ఏంటంటే.. నిన్న ఆ సినిమా పూర్తయ్యిందో లేదో ఈరోజు బాలయ్య తన 102వ సినిమాను మొదలెట్టారు. కె ఎస్ రవికుమార్ డైరక్షన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజునుండి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకోబోతుంది. బోయపాటి శ్రీను క్లాప్ కొట్టి షూటింగ్ మొదలెట్టాడు. 

ఈ సినిమాలో బాలయ్య లుక్ చూస్తే.. ఒక్కసారిగా మనకు లక్ష్మీ నరసింహా మహారథి వంటి సినిమాల్లో కనిపించి ఊరమాస్ లుక్ దర్శనమిస్తుంది. బాలయ్య ఇలా లుక్కులో ఎన్నోసార్లు మెరిసినప్పటికీ.. శాతకర్ణి అంటూ హిస్టారికల్ లుక్ అలాగే పైసా వసూల్ అంటూ క్లాస్ లుక్ చూపించేశాక ఇప్పుడిలా మరోసారి ఊరమాస్ లుక్కులో దర్శనమిస్తే మాత్రం అభిమానులకు షాకింగ్ గానే ఉంది. 

RELATED NEWS

Comment