బన్నీపై అల్లు ఫైర్  .......

బన్నీపై అల్లు ఫైర్  .......

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక వ్యక్తి ఓ శక్తిని దిగజార్చే పని మీదేసుకున్నాడా..? కావాలనే రాద్ధాంతం చేస్తూ ఆ ఫ్యామిలీ ప్రతిష్టను మంటగలుపుతున్నాడా..? అందరివాడైన ఆ హీరోను కొందరివాడిగా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఆ వ్యక్తి నిర్మాత బన్నీవాస్ అయితే.. శక్తి మెగా ఫ్యామిలీ. ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్న బన్నీ వాస్ ఈ మధ్య చేసిన ఒక ట్వీట్ వైరల్ అయింది. అదే ఇప్పుడు మెగాఫ్యామిలీ మొత్తాన్ని ఓ సామాజిక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నంగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతో లేటెస్ట్ గా అల్లు అర్జున్ బన్నీ వాస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.  మరి దీని వెనక ఉన్న వాస్తవ కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం.. బన్నీవాస్.. అల్లు అర్జున్ కు మేనేజర్ గా ఉన్నాడు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ప్రమోషన్ తీసుకుని లేటెస్ట్ గా నెక్ట్స్ నువ్వే సినిమాతో నిర్మాతగానూ మారాడు. ఇంత వరకూ బానే ఉంది. ఆయన ఆ పనులు చూస్తే ఇంకా బావుండేది. కానీ లేటెస్ట్ గా నంది అవార్డుల విషయంలో బన్నీవాస్ చేసిన ట్వీట్ చాలా ప్రశ్నలకు కారణమైంది.

నిజానికి మెగా ఫ్యామిలీలో రెండు అవార్డులు వచ్చాయి. బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ కు, రఘుపతి వెంకయ్య అవార్డు చిరంజీవికీ వచ్చింది. ఈ విషయంలో చిరంజీవి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇతర అవార్డ్ విన్నర్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కానీ బన్నీవాస్ కు అది కనిపించలేదు. ‘మా’హీరోలకు అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందంటూ తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. తర్వాత ఆ ట్వీట్ ను తొలగించాడు. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే అవార్డుల కమిటీలో అల్లు అరవింద్ ఉన్నాడు. అంటే బన్నీవాస్ అరవింద్ నిర్ణయాన్ని తప్పుబట్టినట్టు.. అలాగే చిరంజీవి చెప్పిన విషెస్ కూడా తప్పు అని చెప్పినట్టే కదా. మా హీరో మా హీరో అంటూ ఊగిపోతూ మెగా ఫ్యామిలీని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నంలో ఉన్నాడా బన్నీ వాస్.. అనే ప్రశ్నలు ఉత్పన్నం కాక తప్పదు. అదే నిజమైతే ఒక సామాజిక వర్గం చూస్తేనే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడా.. ఒకే సామాజిక వర్గం ఆదరిస్తేనే ఆ ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నారు. ఆ మాత్రం స్పృహ లేకుండా ఎలా కమెంట్ చేస్తారు.

హీరోలే హుందాగా ఉన్నప్పుడు ఇతను మాత్రం ఇలా కుల చిచ్చులుపెట్టడం ఎంత వరకూ కరెక్ట్..నిజానికి మెగా హీరోల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోంది బయటివారెవరూ కాదు. బన్నీ వాస్ లాంటి మేనేజర్లు.. కొన్నాళ్ల క్రితం ధృవ సినిమాకు సంబంధించి చరణ్ వద్ద కొంచెం ఎక్కువ చేయడంతో చరణ్ చాలా సీరియస్ అయ్యి ఏకంగా తమ ఫ్యామిలీలోనే మొదటిసారిగా పీఆర్వోలను తీసేశాడు. రాబోతోన్న సినిమా విషయంలో కూడా కొత్త పీఆర్వోలనే కంటిన్యూ చేయబోతున్నాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చాలా చీలికలు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరమైతే, అల్లు అర్జున్ పవన్ కు దూరమయ్యాడు. అంతర్గతంగా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు. అవి చాలవన్నట్టు ఇప్పుడు మా హీరోలు మా హీరోలు అంటూ మెగా హీరోలను ఒక కులానికి పరిమితం చేయాలనుకుంటోన్న బన్నీవాస్ ‘‘అసలు ఉద్దేశ్యం’’ఏంటనేది అతనికే తెలియాలి. అవార్డుల్లో అవకతవకలు జరిగాయని అంతా చెప్పుకుంటున్నారు. ఆ విషయాన్ని అలా వదిలేస్తే పోయేది. కానీ మా హీరోలు అనడమే మెగా హీరోలను ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసే సంకుచిత ఆలోచనగా కనిపిస్తోంది. అంత పెద్ద ఫ్యామిలీ ఇంత సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఆదరించడం ఆశ్చర్యమే.. ఒక్క అవార్డుల విషయంలోనే కాదు.. ఆ మధ్య వచ్చిన నెక్ట్స్ నువ్వే సినిమా విషయంలోనూ బన్నీ వాస్ అత్యుత్సాహమే ఆ సినిమా ఫ్లాప్ కు కారణం అనేది అల్లు అరవింద్ కూ తెలుసంటారు. 

నిజానికి దర్శకుడు ప్రభాకర్ వినిపించిన కథ అది కాదు.. అతను చెప్పిన కథ అరవింద్ కు నచ్చింది. అలాంటిది అరవింద్ నిర్ణయాన్ని కూడా కాదని.. ఓ రీమేక్ స్టోరీని తెచ్చి ప్రభాకర్ తోడైరెక్ట్ చేయించారు. కట్ చేస్తే రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. మొత్తానికి సరైన ప్రణాళికలు లేని అత్యుత్సాహపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తుల వల్లే ఎక్కువ ఇబ్బంది అని ఇకనైనా మెగా ఫ్యామిలీ గుర్తించాలి. లేదంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఇలా ఒక కులానికి పరిమితం చేసే ప్రమాదకరమైన ఆలోచనలు మరింత వికృత ట్వీట్స్ కు కారణమౌతాయనేది నిజం.. మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా చూశాక అల్లు అరవింద్ కూడా బన్నీవాస్ చేసిన పనిపై అల్లు అర్జున్ వద్ద గుర్రుగా ఉన్నాడట. తండ్రి అంత ఇబ్బందిపడటంతో అల్లు అర్జున్ కూడా బన్నీవాస్ పై ఫైర్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా చనువిస్తే చంకనెక్కిన విధంగా చేసిన బన్నీవాస్ తీరుపై ఎంటైర్ అల్లు ఫ్యామిలీ సీరియస్ గా ఉందని ఫిల్మ్ నగర్ టాక్... 

RELATED NEWS

Comment