మీ టూ.. పై బాంబ్‌ పేల్చిన టాప్‌ యాంకర్‌ అనసూయ...!!

మీ టూ.. పై బాంబ్‌ పేల్చిన టాప్‌ యాంకర్‌ అనసూయ...!!

మీటూ... ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, హాలీవుడ్‌... ఇలా ఏ వుడ్‌ని చూసినా ప్రస్తుతం వినిపిస్తోన్న పదం. నిన్నమొన్నటిదాకా టాప్‌ హీరోయిన్‌లు, కేరక్టర్‌ ఆర్టిస్టులు, సింగర్‌లకే పరిమితం అయిన మీటూ మూమెంట్‌ తాజాగా జర్నలిస్టులకు కూడా పాకింది. లేడీ జర్నలిస్టులు తమకు జరిగిన లైంగిక వేధింపులను తాజాగా రివీల్‌ చేస్తున్నారు.. 
 
ప్రస్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌ని షేక్‌ చేసిన మీటూ మూమెంట్‌పై తెలుగు బుల్లితెర టాప్‌ యాంకర్‌, అందాల భామ అనసూయ కామెంట్‌ చేసింది.. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు జరగడం అత్యంత బాధాకరం అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.. ఏ చిత్ర పరిశ్రమ సంగతి ఎలా ఉన్నా... టాలీవుడ్‌లో మాత్రం ఈ తరహా వేధింపులు చాలా తక్కువ అని ఆమె అభిప్రాయ పడింది. లైంగిక వేధింపులు మహిళలకే కాదని అబ్బాయిలకు కూడా విస్తరించడం అవమానకరమని వ్యాఖ్యానించింది.. అనసూయ కామెంట్స్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోయిన్‌లు, యాంకర్‌లు మండిపడుతున్నారు.. శ్రీరెడ్డి తనకు జరిగిన క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను చెప్పినప్పుడు ఒక్క కామెంట్‌ కూడా చేయని ఈ లేడీ యాంకర్‌.. ప్రస్తుతం ఇలా వ్యాఖ్యానించడం కాంట్రవర్శీకి దారితీస్తోంది. 
 
టాలీవుడ్‌లో రీసెంట్‌గా ఓ లేడీ జర్నలిస్ట్‌ ఓ టాప్‌ హీరో తనను పర్సనల్‌గా కలవాలని, తనతో షేర్‌ చేసుకోవాలని అనేక సార్లు ఫోన్‌ చేసినట్లు వెల్లడించింది. దీనిపై సోషల్‌ మీడియాలో రచ్చ జరిగింది. ఆ హీరో ఫ్యాన్స్‌ ఆమెను టార్గెట్‌ చేయడంతో ఆ పోస్ట్‌ని డిలీట్‌ చేసింది.. మరోవైపు, కోలీవుడ్‌లో సింగర్‌ చిన్మయి సృష్టించిన రగడ ఆ చిత్ర పరిశ్రమను షేక్‌ చేస్తోంది.. ఇదే ఊపులో తెలుగులోనూ ఈ రగడ రేగుతుందోమో చూడాలి.. 

RELATED NEWS

Comment