కాళిమాతను అభిషేకించడానికి మానవ రక్తం కోసం ప్రకటన

కాళిమాతను అభిషేకించడానికి మానవ రక్తం కోసం ప్రకటన

తదితర ద్రవ్యాలతో కొన్ని దేవాలయాల్లో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి.కాళిమాతను అభిషేకించడానికి మానవ రక్తం కోసం ప్రకటన

దేవాలయంలోని విగ్రహాలకు అభిషేకం నిర్వహించి ఆలయం శుద్ధి చేయడం సర్వసాధారణం.. ఇక భక్తులు తమ కోరికలను నేరవేర్చమని పాలు, నెయ్యి, పెరుగు, గంధం వంటి తదితర ద్రవ్యాలతో కొన్ని దేవాలయాల్లో నిత్యాభిషేకాలు నిర్వహిస్తుంటారు. . అలా చేస్తే తమకు సకల సంపదలు స్వచ్చమైన మనసుతో నీటితో దేవుడిని అభిషేకించినా తమ కోరికలు నేరవేరతాయాని భక్తుల విశ్వాసం..

కానీ దేవతల ఆలయాల్లో ముఖ్యంగా కాళిమాత ఆలయాల్లో జంతు బలులు కూడా ఇవ్వడం పరిపాటి. అయితే కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని విధుర అనే గ్రామంలోని ఆలయ అధికారులు అమ్మవారిని అభిషేకించడానికి మానవ రక్తం కావాలంటూ ఓ బహిరంగ ప్రకటన చేశారు.
ప్రతిఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగానే రక్తాభిషేకం చేయాల్పి ఉన్నందున భక్తులు రక్తాన్ని దానం చేయాలని ప్రకటన చేయడంతో పాటు ఊర్లో పోస్టర్లు కూడా అంటించారు. మార్చి 12 సాయింత్రం జరిగే ఈ ఉత్సవంలో అమ్మవారికి అభిషేకం జరుప తలపెట్టారు. ఈ ఉత్సవాన్ని మహాఘోర కాళీయజ్ఞంగా పిలుస్తారు. మొత్తం 14 రోజులు నిర్వహించే ఈ ఉత్సవంలో రెండో రోజున కాళీమాతకు రక్తాభిషేకం చేస్తారు. ఆ రోజు జరిపే ఈ కార్యక్రమాన్ని కాళీయత్తు మహోత్సవం అని పిలుస్తారు. భక్తులు కాళీమాత ఆకలిని తీర్చే గొప్ప వేడుకగా దీన్ని అభివర్ణిస్తారు.

RELATED NEWS

Comment