అరవింద సమేత... ఇంట్రడక్షన్‌ అదుర్స్‌.... తొలి 20నిముషాలు కేక.....!!!

అరవింద సమేత... ఇంట్రడక్షన్‌ అదుర్స్‌.... తొలి 20నిముషాలు కేక.....!!!

అరవింద సమేత వీరరాఘవ.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బడా కాంబినేషన్‌ మూవీ.. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని సినిమా తొలి 20 నిముషాల్లోనే చేరుకుందని చెబుతున్నారు అభిమానులు. ఇటు ట్రేడ్‌ వర్గాలు, క్రిటిక్స్‌ది సైతం ఇదే మాట.. అరవింద సమేత వీరరాఘవ ఇంట్రడక్షన్‌ సీన్‌ అదుర్స్‌ అని, తొలి 20 నిముషాల సేపు సినిమా రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయిందనే టాక్‌ అనానిమస్‌గా వినిపిస్తోంది.. 
 
అజ్ఞాతవాసి సినిమాతో డల్ అయిన త్రివిక్రమ్‌... అరవింద సమేతతో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు. నాలుగు కథల తర్వాత తారక్‌కి అరవింద సమేతలోని ఇంట్రడక్షన్‌ సీన్‌నే నారేట్‌ చేశాడట మాటల మాంత్రికుడు. ఆ సీన్‌ తనకు బాగా కనెక్ట్ అయిందని, ఆ ఒక్క సీన్‌తోనే తాను ఈ కథకు ఓకే చేశానని, దానిని డెవలప్‌ చేయమని అడిగానని రివీల్‌ చేశాడు తారక్‌.. దీంతో, ఓపెనింగ్‌ సీన్‌పై ఫ్యాన్స్‌లోనూ అంచనాలు అమాంతం పెరిగాయి.. అయితే, మూవీ రిలీజ్‌ తర్వాత స్క్రీన్‌పై ఆ సీన్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.. తొలి 20 నిముషాల తర్వాతే తారక్‌ పేరును టైటిల్‌ కార్డ్స్‌లో వేశాడ దర్శకుడు త్రివిక్రమ్‌. అంటే ఆయనకు ఈ పార్ట్‌పై ఎంత కాన్ఫిడెన్సో ఉందో అర్ధం చేసుకోవచ్చు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా తన సినిమాను బాగా ప్రమోట్‌ చేసుకున్నాడు మాటల మాంత్రికుడు. అజ్ఞాతవాసి ప్రభావం కావొచ్చు.. సినిమాని తన మేకింగ్‌ స్టయిల్‌కిభిన్నంగా చేసి, మార్కెట్‌ చేసుకోవాలన్న తపన కావొచ్చు... త్రివిక్రమ్‌ అరవిందను డిఫరెంట్‌గా ప్రమోట్‌ చేశాడు. దాదాపు నాలుగు రోజుల పాటు హీరో, దర్శకుడు ఎక్కడికీ కదలకుండా కేవలం మీడియాతోనే సమయం గడిపేశారు. చివరికి వెబ్‌ మీడియాకి కూడా ఇంటర్‌వ్యూలు ఇచ్చేశారు.. తమ శ్రమకు తగ్గట్లుగానే తొలి 20 నిముషాలు అవుట్‌పుట్‌కి థియేటర్లలో సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావడంతో తారక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.... త్రివిక్రమ్‌కి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.. తారక్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.. 

RELATED NEWS

Comment