అరవింద సమేత మార్నింగ్‌ షో రివ్యూ....!!

అరవింద సమేత మార్నింగ్‌ షో రివ్యూ....!!

టాలీవుడ్‌లో రీసెంట్‌గా ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్‌ అరవింద సమేత వీరరాఘవ. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి మూవీ ఇది. పుష్కరకాలం తర్వాత వీరి కాంబోలో రూపొందిన ఈ సినిమాపై బాక్సాఫీస్‌ దగ్గర భారీ అంచనాలున్నాయి.. వరస విజయాలతో దూసుకుపోతున్న తారక్‌ ఒకవైపు, అజ్ఞాతవాసి వంటి ఫ్లాప్‌ తర్వాత త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం కావడంతో సినిమాపై సహజంగానే అంచనాలు అనూహ్యంగా పెరిగాయి. మరి, అరవిందసమేతుడు బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి టాక్‌ పొందాడో చెక్‌ చేద్దాం.. 
 
 
వీరరాఘవది ఫ్యాక్షన్‌ నేపథ్యం గల కుటుంబం. తండ్రి నారప రెడ్డి (నాగబాబు) సీమలోని ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. ఆయనకు వ్యతిరేకంగా బసిరెడ్డి (జగపతిబాబు) మరో ఫ్యాక్షన్‌ వర్గానికి నేతృత్వం వహిస్తుంటాడు. రెండు వర్గాల మధ్య ఎన్నాళ్లనుంచో పగ, ప్రతీకారాలు రగులుతుంటాయి. మరోవైపు, వీరరాఘవ మాత్రం శాంతి మంత్రాన్ని జపిస్తుంటాడు.. పగ, ప్రతీకారాల స్థానంలో ఆయన శాంతిని కోరుకుంటాడు.. అయితే, ఇంట్రడక్షన్‌ సీన్‌లోనే తండ్రి నారపరెడ్డిని కోల్పోతాడు వీరరాఘవ. దీంతో, ఆయన ఎవరికీ కనిపించకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో ఉండాలని సిటీకి వస్తాడు.. అక్కడ వీరరాఘవ అరవిందను కాపాడడం అనే టాస్క్‌లో ఉంటాడు.. అరవింద ఫ్యాక్షనిజం మీద డాక్యుమెంటరీ చేయాలని భావిస్తుంటుంది.. మరి, ఆమెను కాపాడతాడా..? మళ్లీ కడప వెళ్లి వీరరాఘవుడు శాంతి నెలకొల్పుతాడా....? అనేది క్లయిమాక్స్‌.. 
 
త్రివిక్రమ్‌ తన శైలికి భిన్నంగా ఈ మూవీని తెరకెక్కించాడు. గతంలో ఫ్యామిలీ ఎంటర్‌టయిన్‌మెంట్‌కి పెద్ద పీట వేసిన మాటల మాంత్రికుడు ఈసారి రూట్‌ మార్చాడు.. స్టోరీ చెప్పడంలోనే మునిగిపోయాడు. అందుకే, ఎంటర్‌టయిన్‌మెంట్‌కి దూరం జరిగాడు. తన ట్రేడ్‌ మార్క్‌కి భిన్నంగా మూవీని రూపొందించాడు... రంగస్థలం, మహానటి, అర్జున్‌ రెడ్డి వంటి చిత్రాల సక్సెస్‌తో కథని నారేట్‌ చేయడంలోనే త్రివిక్రమ్‌ ఫోకస్ చేశాడు. మాటల మాంత్రికుడు తన సహజ శైలికి భిన్నంగా జరిగినా, తన డైలాగ్‌ పవర్‌తో సంచలనం సృష్టించాడు.. స్టోరీ టెల్లింగ్‌లో తనదైన ముద్ర వేశాడు. త్రివిక్రమ్‌ డైలాగ్‌లకి ప్రాస తగ్గినా, పంచ్‌, పవర్‌ మాత్రం అలాగే ఉంది.. దానికి రాయలసీమ యాస కలవడం కొత్త గిలిగింతలు పెడుతుంది.. ఇక, నటుడిగా తారక్‌ మరోసారి తనదైన మార్క్‌ చూపించాడు. ఈ తరం టాలీవుడ్‌ హీరోలలో పెర్‌ఫార్మెన్స్‌లో తనకు ఎవరూ సాటిరారని ప్రూవ్‌ చేశాడు.. ఇంటెన్స్‌ డ్రామాకి తగ్గ రోల్‌లో తారక్‌ అదుర్స్‌ అనిపించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు.. తారక్‌ కెరీర్‌లో వీరరాఘవ పాత్ర చిరకాలం గుర్తుంటుంది.. అంతలా పాత్రలో ఒదిగిపోయాడు. గతంలో ఫ్యాక్షన్‌ సినిమాలలో నటించినా ఇది పూర్తిగా భిన్నమైన కేరక్టర్‌.. అయినా దర్శకుడు త్రివిక్రమ్‌ అంచనాలను ఈజీగా పాస్‌ అయ్యాడు.. పూజా హెగ్డే రోల్‌ పర్లేదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువగా స్కోప్‌ లేదు.. తారక్‌తో పోటీ నటించాడు విలన్‌ రోల్‌లో జగపతి బాబు.. ఆయన ఆహార్యం, డైలాగ్‌ డెలివరీ రియల్‌ ఫ్యాక్షనిస్ట్‌ని తలపిస్తుంది.. ఇంటర్వెల్‌ సీన్‌లో బసిరెడ్డిగా జగపతిబాబు యాక్టింగ్‌కి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. అంతలా ఆకట్టుకున్నాడు. జగపతిబాబు కెరీర్‌లో చిరిస్థాయిగా నిలిచిపోయే రోల్‌ ఇది.. 
 
మొత్తమ్మీద, సినిమాకి మంచి మార్కులు పడుతున్నాయి.. ఫస్ట్‌ హాఫ్‌ ఎంటర్‌టయిన్‌మెంట్‌తో సాగిపోతే, ఇంట్రడక్షన్‌ సీన్‌ తారక్‌ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెరకెక్కించాడు త్రివిక్రమ. సెకండాఫ్‌లో కాస్త డ్రామా ఎక్కువయినా స్టోరీ నారేషన్‌లో కలిసిపోతుంది. సెకండాఫ్‌లో కాస్త బోర్‌ కొట్టినట్లు అనిపించినా, క్లయిమాక్స్‌తో మరోసారి త్రివిక్రమ్‌ చెరగని ముద్ర వేశాడు.. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా..? లేదా...? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.. 
 
రేటింగ్‌... 3/5.. 
బాటమ్‌ లైన్‌... త్రివిక్రమ్‌ సమేత తారక్‌

RELATED NEWS

Comment