ఒక్క ఫ్లాప్‌కే చేతులెత్తేసిన అర్జున్‌ రెడ్డి...??

ఒక్క ఫ్లాప్‌కే చేతులెత్తేసిన అర్జున్‌ రెడ్డి...??

విజయ్‌ దేవరకొండ... ఏ సూపర్‌ స్టార్‌ ఇన్‌ ది మేకింగ్‌... బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో భారీ క్రేజ్‌ దక్కించుకున్న ఈ యువ నటుడు ఒక్క ఫ్లాప్‌కే చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోంది.. ఆయన లేటెస్ట్‌ మూవీ నోటా బాక్సాఫీస్‌ దగ్గర డీలా పడింది.. వరసగా హిట్స్‌ దక్కించుకుంటూ, తన రికార్డులను తానే బ్రేక్‌ చేసుకుంటూ వస్తోన్న విజయ్‌ దేవరకొండకు ఈ ఫ్లాప్‌ మింగుడు పడలేదు.. అందుకే, ఆయన మంగళవారం తన ట్విట్టర్‌లో తన వ్యతిరేకులంతా పండగ చేసుకోండి.. ఆ తర్వాత మళ్లీ చాన్స్‌ రాకుండా చేస్తా అంటూ సంచలన పోస్ట్‌ పెట్టారు.. విజయ్‌ ట్వీట్‌ టాలీవుడ్‌లో పెను దుమారం రేపుతోంది.. ఒక్క ఫ్లాప్‌తోనే విజయ్‌ ఇలా డీలా పడడం ఏంటని... సక్సెస్‌ వచ్చినప్పుడు పొంగిపోవడం, ఫ్లాప్‌లు దక్కినప్పుడు కుంగిపోవడం ఏంటని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.. అయినా విజయ్‌ సినిమాలు ఫ్లాప్‌ అయితే ఎవరు పండగ చేసుకుంటారు...? ఎందుకు పండగ చేసుకుంటారు..? అనేది మరో ప్రశ్న.. ఆయనకు ప్రత్యర్ధులుగా మారిన యువ హీరోలా...? లేక, తనకు ఏర్పడిన యాంటీ ఫ్యాన్స్‌ గురించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా..? అనేది కీలకంగా మారింది. 
 
పెళ్లిచూపులు సినిమాతో విజయ్‌కి తొలి విజయం దక్కింది. అర్జున్‌ రెడ్డి మూవీతో ఆయన కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశాడు. ఇక గీతగోవిందంతో రికార్డులు కొల్లగొట్టాడు. ఇలా కెరీర్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లతో దూసుకుపోతున్న టైమ్‌లో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నోటా డిజాస్టర్‌గా నిలిచింది.. దీనిపై తాజాగా వివరణ ఇస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టాడు.. తన సినిమా ఫ్లాప్‌ అయినందుకు ఇప్పుడే పండగ చేసుకోండి.. ఇకపై ఆ చాన్స్‌ రానివ్వను అంటూ తెలిపాడు.. ఆ సినిమాలో కేరక్టర్‌, స్టోరీ నచ్చడంతోనే ఒప్పుకున్నానని, కానీ, బాక్సాఫీస్‌ దగ్గర అలరించనందుకు క్షమాపణలు చెప్పాడు. ఇకపై తన సినిమాలను పక్కాగా ఎంచుకుంటానని తన ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు.. ఈ పోస్ట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.. ఒక్క ఫ్లాప్‌తోనే ఆయన ఇలా డీలా పడడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.  రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరోలకే డిజాస్టర్‌లు తప్పలేదు. అపజయాలు దక్కినప్పుడు వారు ఇలా రివర్స్‌కాలేదని, విజయ్‌ కెరీర్‌ రెయిజింగ్‌లో ఉన్న టైమ్‌లో రౌడీ అనే ట్యాగ్‌తో ఇలాంటి కామెంట్స్‌ పోస్ట్‌ చేయడం కాంట్రవర్శీలకు దారితీస్తోంది. విజయ్‌ యాటిట్యూడ్‌ని తెరపై చూపించాలి కానీ, ఇలా ఒరిజినల్‌గా చూపిస్తే అది అపహాస్యం పాలవుతుందని, సోషల్‌ మీడియాలో అప్పుడే మెమెలు పోస్ట్ అవుతున్నాయి.. ఎదుగుతున్నప్పుడే ఒదిగి ఉండాలి.. ఈ విషయం విజయ్‌కి ఎంత తొందరగా తెలిస్తే అంత బెటర్‌.... 

RELATED NEWS

Comment