బాలయ్య భలే ఉన్నాడే..?

బాలయ్య భలే ఉన్నాడే..?

నందమూరి బాలకృష్ణ స్పీడ్ కు యంగ్ స్టార్స్ కూడా డంగై పోతున్నారు. వరుస సినిమాలతో కుర్రాడిలా మారిపోతున్నాడు బాలయ్య. 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో బ్లాక్ బస్టర్ అందుకుని.. ఎవ్వరూ ఊహించని విధంగా పూరీ జగన్నాథ్ తో 101వ సినిమాగా పైసా వసూల్ చేశాడు. ఆల్రెడీ గుమ్మడికాయ కొట్టుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఆ సినిమా పూర్తయిందో లేదో వెంటనే 102వసినిమా మొదలుపెట్టాడు. రామోజీ ఫిలిమ్ సిటీలో ప్రారంభైమన ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్టర్. సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఓపెనిగ్ డే స్టిల్స్ చూస్తోంటే.. బాలయ్య మళ్లీ ఓ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఊరమాస్ స్టైల్ లో ఉన్న బాలయ్య లుక్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. రామోజీ ఫిలిమ్ సిటీలో కంటిన్యూస్ గా 30రోజుల పాటు షూటింగ్ జరుపుకోబోతోన్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తానికి బాలయ్య స్పీడ్ కు హీరోలే కాదు ఇండస్ట్రీ కూడా షాక్ అవుతోంది..

RELATED NEWS

Comment