జస్ట్ బివేర్ ఆఫ్ నక్షత్రం

జస్ట్ బివేర్ ఆఫ్ నక్షత్రం

రివ్యూ     : నక్షత్రం
ఆర్టిస్ట్స్    : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైశ్వాల్, ప్రకాష్ రాజ్, శివాజీరాజా, తనీష్ తదితరులు
సంగీతం    : భీమ్స్, మణిశర్మ, హరిగౌర
ఎడిటింగ్    : శివ వై ప్రసాద్
నిర్మాతలు    : కె.శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు
దర్శకత్వం    : కృష్ణవంశీ 


ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో సెన్షేషనల్ మూవీస్ తీసిన దర్శకుడు కృష్ణవంశీ. కానీ ఈ మధ్య ఆ టచ్ కోల్పోయాడు. వరుస వైఫల్యాలతో తను ఇబ్బండిపడటమే కాదు..ప్రేక్షకుల్నీ ఇబ్బంది పెడుతున్నాడు. గోవిందుడు అందరివాడేలే తర్వాత కొంత గ్యాప్ తో నక్షత్రంతో వస్తున్నాడు. చూడ్డానికి మినీ మల్టీస్టారర్ లా కనిపిస్తోన్న నక్షత్రంతో మళ్లీ కృష్ణవంశీ ఏదైనా మ్యాజిక్ చేశాడా లేదా అనేది చూద్దాం.. 


కథ    : 
రామారావు(సందీప్)ఎస్ఐ కావాలని కలలు కనే కుర్రాడు. చనిపోయిన తండ్రి పోలీస కావడంతో ఆ క్యార్టర్స్ లో ఉంటుంటారు. తనూ పోలీస్ కావాలని ఎంతో కష్టపడుతుంటాడు. కానీ అతనికి ఇంగ్లీష్ సరిగా రాదు. దీంతో రెండుసార్లు ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు. అదే క్వార్టర్స్ లో ఉంటూ సినిమాల్లో సైడ్ డ్యాన్సర్ గా పనిచేసే జమున(రెజీనా)ను ప్రేమిస్తుంటాడు. అయితే ఎస్ఐ కావాలని అతను చేసే చివరి ప్రయత్నానానికి కమీషనర్ కొడుకు అడ్డు తగులుతాడు. దీంతో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయిన రామారావు అలెగ్జాండర్ అనే పోలీస్ డ్రెస్ వేసుకుని డ్యూటీ చేస్తూ ఓ బాంబ్ బ్లాస్ట్ సందర్భంగా పోలీస్ లకు దొరుకుతాడు. అప్పటి నుంచి అలెగ్జాండర్ ఎక్కడా అంటూ రామారావును టార్చర్ చేస్తారు పోలీస్ లు. అసలు అలెగ్జాండర్ ఎవరు..? కమీషనర్ కొడుకు రామారావుకు ఎందుకు అడ్డు తగిలాడు..? ఇంతకీ రామారావు కల ఏమైంది అనేది మిగతా సినిమా..?

విశ్లేషణ    :  
కొన్ని సినిమాల జాతకాలు ట్రైలర్ తోనే తేలిపోతాయి. మరికొన్ని సినిమాలు ఎక్స్ పెక్టేషన్స్ కు అందకుండా సర్ ప్రైజ్ చేస్తాయి. ఈ రెండు విషయాల్లోనూ డిజప్పాయింట్ చేసిన సినిమా నక్షత్రం. ఖచ్చితంగా చెప్పాలంటే పేరుకు తగ్గట్టే నక్షత్రంతో చుక్కలు చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ. కొన్ని సీన్స్ చూస్తుంటే అసలు అతనేనా ఈ సినిమాకు దర్శకుడు అనిపిస్తుంది. అంత దారుణమైన సీన్స్ ఉన్నాయి. కథ పక్కాగా లేనప్పుడు కథనం గాడి తప్పుతుంది. నక్షత్రం విషయంలో ఇదే జరిగింది. అసలు ఈ సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతనికే క్లారిటీ లేదు. అలాంటప్పుడు కథనం విషయంలో మాత్రం ఏం క్లారిటీ ఉంటుంది. అందుకే డిఎస్పీ స్థాయి అధికారిణితో ర్యాంప్ వాక్ చేయించి అక్కడి మోడల్స్ సెల్ ఫోన్స్, బ్యాగులు కొట్టేసే సీన్స్ పెట్టాడు. లేదంటే.. ఆమె లారీ దొంగతనం చేస్తుంది. కట్ చేస్తే మళ్లీ పోలీస్ గా కనిపిస్తుంది. పోనీ దొంగతనాల సీన్ వెనక ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉందా అంటే అసలదేం పట్టించుకోలేదు. ఇక పోలీస్ కావాలని ప్రయత్నించే అభ్యర్థులకు వచ్చే పూర్తి క్వశ్చన్ పేపర్ లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ మాత్రమే. కానీ టెన్త్ క్లాస్, ఇంటర్ ఎగ్జామ్స్ లో ఉన్నట్టు ఆ సబ్జెక్ట్ కేదో స్పెషల్ ఎగ్జామ్ ఉన్నట్టు చూపించడంలో ఎంతో అవగాహనా రాహిత్యం లేదా.. నిర్లక్ష్యం కనిపిస్తంది. ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉంటాయి. సాక్షాత్ కమీషనర్ కొడుకు డ్రగ్స్ దందాలో ఉంటూ ఇల్లీగల్ వెపన్ బిజినెస్ చేస్తుంటే ఎంతో పవర్ ఫుల్ అని చెప్పుకునే కమీషనర్ కే తెలియదు.. కథ, పాత్రలు, వాటి క్యారెక్టరైజేషన్, బిహేవియర్.. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. అవేవీ ఫాలో కాకుండా కేవలం తనకు తోచింది తీసుకుంటూ వెళ్లిపోయడు కృష్ణవంశీ. నక్షత్రం చూసిన తర్వాత అతనిపై ఎవరికైనా(ఇంకా) రెస్పెక్ట్ ఉంటే పోతుందేమో కూడా. ఎందుకంటే ఈ సినిమా చూశాక.. అసలు ఇతనేనా గులాబి, సిందూరం, అంతపురం, ఖడ్గం వంటి సినిమాలు తీసిన దర్శకుడు అనిపిస్తుంది. అంత సిల్లీగా ఉంటాయి సీన్స్. ఏ దశలోనూ కథనం పై ఇంట్రెస్ట్ కలిగేలా చేయలేకపోయాడు. కనీసం సాయిధరమ్ తేజ్ ఎపిసోడ్ కూడా ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించదు. కమీషనర్ నుంచి కార్ డ్రైవర్ వరకూ అలెగ్జాండర్ గురించి బిల్డప్ ఇస్తుంటే అబ్బో ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అని ఊహిస్తాం. కానీ కాసింత హడావిడీ.. హాట్ హాట్ అందాల ప్రదర్శనల హీరోయిన్ తో పాటేసుకుని ఆఖరికి విలన్ చేతిలో కుక్కచావు(ఆ టైమ్ లోఈ పాత్ర కనీసంగా కూడా ఎదురుతిరగదు) చస్తాడు..దీంతో అప్పటి వరకూ ఈ పాత్రపై అంచనాలు పెంచుకున్నవారు.. ఆఖరి ఆశ కూడా వదులుకుంటారు. ఇక పాటల విషయంలో మాత్రం కృష్ణవంశీ చాలా శ్రద్ధ పెట్టాడు. అంటే సంగీతంపైనో, సాహిత్యంపైనో కాదు.. హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనపై. ఈ విషయంలో ఎంత పైత్యం చూపించాలో అంతా చూపించాడు. హీరోయిన్లను కేవలం వారి అందాలు చూపించడానికే తీసుకున్నాడా అనిపిస్తాడు. మొత్తంగా నక్షత్రంతో థియేటర్ లో చుక్కలు చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ.
ఇక ఆర్టిస్టుల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. మామూలుగానే కృష్ణవంశీ సినిమాల్లో ఆర్టిస్టులకు ‘‘అరవం’’పూనుతుంది. అయిందానికీ కాందానికీ అతి చేస్తుంటారు. ఇది ఈ అతి కూడా శ్రుతి మించింది. ప్రతి ఆర్టిస్ట్ పోటీ పడిమరీ అతికిపోయారు.. సందీప్ కిషన్ ను చూస్తే జాలేస్తుంది. అసలు సాయిధరమ్ తేజ్ క్యారెక్టరైజేషన్ ఎంత పూర్ గా ఉంటుందో చెప్పలేం. అతని నటనా ఏమంత గొప్పగా లేదు. తులసి చేసే అతి చూస్తే అరవోళ్లు కూడా జడుసుకుంటారు. కనిపించిన ప్రతిసారీ ప్రగ్యాజైశ్వాల్ ఫైట్స్ చేస్తుంటే ఆ దెబ్బలు మనకే తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ కు ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. ఉన్నంతలో నటన పరంగా తన క్యారెక్టర్ కు సరిపోయేలా తనీష్ మాత్రమే మెప్పించడం ఆశ్చర్యం. శ్రీయ ఐటమ్ సాంగ్ వేస్ట్.

టెక్నికల్ గా    : 
సాంకేతికంగా అందరికీ రిజల్ట్ ముందే తెలిసినట్టుగా పనిచేశారు. ముగ్గురు సంగీత దర్శకులను పెట్టామని గొప్పగా చెప్పుకున్నా ఒక్కరూ మెప్పించలేదు. ఆర్ఆర్ అయితే ప్రేక్షకుల ఫీలింగ్స్ తో ఆడుకుందనే చెప్పాలి. ఒక్కపాటా బాలేదు. మాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. కెమెరా వర్క్ కూడా వెరీ యావరేజ్. ఎడిటింగ్ పరంగా కనీసం అరగంటకు పైగా తీసేసినా మెప్పించే చాన్స్ లేదు. అంటే ఇంకెంత పెయినో ఊహించుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జస్ట్ ఓకే.. 

ప్లస్ పాయింట్స్     : 
ఏమీ లేవు

మైనస్ పాయింట్స్  : 
నక్షత్రం సినిమానే.. 


ఫైనల్ గా    : జస్ట్ బివేర్ ఆఫ్ నక్షత్రం

రేటింగ్    :  0.5/5

                - యశ్వంత్

RELATED NEWS

Comment