పెట్రో మంట‌ల్లో బీజేపీ కాలిపోవ‌డం త‌థ్యం

పెట్రో మంట‌ల్లో బీజేపీ కాలిపోవ‌డం త‌థ్యం

వంద రోజుల్లో ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌న్నారు... పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ కొట్టేస్తున్నారు...పెట్రో మంట‌ల్లో బీజేపీ కాలిపోవ‌డం త‌థ్యం: - జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జి.చిన్న‌య్య దొర‌
 
విజ‌య‌వాడ‌: వంద రోజుల్లో ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని... కేంద్రంలో గ‌ద్దె నెక్కిన బీజేపీ ప్ర‌భుత్వం, చివ‌రికి పెట్రోలు ధ‌ర‌ను వంద చేసేస్తోంది. పెట్రో ధ‌ర‌ల మంట‌ల‌ను వెంట‌నే చ‌ల్లార్చ‌క‌పోతే, ఆ మంట‌ల్లో బీజేపీ కాలిపోవ‌డం ఖాయం. పెట్రో ధ‌ర‌ల పెంపుపై చేస్తున్న బందుకు జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతోంది. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఇంత వేగంగా పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డం, ఎన్డీయే ప్ర‌భుత్వం సృష్టించిన రికార్డు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు నిత్యం పెరిగిపోవ‌డం, ప్రజలకు పెను భారంగా మారింది. దీని వ‌ల్ల అన్ని నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి.  
అంత‌ర్జాతీయంగా చ‌మురు బ్యారెల్ ధ‌ర‌లు త‌గ్గినా, ఇక్క‌డ మాత్రం అమితంగా పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రే. చ‌మురును జి.ఎస్.టి. ప‌రిధిలోకి తేకుండా బీజేపీ ప్ర‌భుత్వం పెద్ద తప్పిదం చేసింది. మ‌రో ప‌క్క రాష్ట్రాలు కూడా పెట్రోల్ పై వ్యాట్, ఇత‌ర ప‌న్నుల‌ను త‌గ్గించుకోక‌పోవ‌డంతోనే ధ‌ర‌లు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ల‌ను జి.ఎస్.టి. ప‌రిధిలో చేర్చాల‌ని  జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ త్వ‌ర‌లో ఢిల్లీలో ఉద్య‌మిస్తుంది. 

RELATED NEWS

Comment