అన్ని పార్టీలతో చంద్రబాబు అఖిలపక్ష సమావేశం

అన్ని పార్టీలతో చంద్రబాబు అఖిలపక్ష సమావేశం

అఖిలపక్ష సమావేశంలో సీపీఎం నేత మధు:

భారతదేశంలో ఏనాడూ ఏ రాష్ట్రానికీ జరగని అన్యాయం మన ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది.
పార్లమెంటులో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయడంలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఈ నాలుగేళ్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉంటే బాగుండేది.
అమిత్‌షా లేఖ రాజకీయ స్కోరు కోసం రాసినదే.
ఎవరు ఏ మాంసం తినాలి? ఎవరు ఏ అమ్మాయితో లవ్ జిహాద్ చేయాలి వంటి వ్యక్తిగత అంశాలపై కూడా ప్రజలకు నిర్దేశాలు ఇచ్చేది. ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించడం బీజేపీ మౌలిక లక్షణం.

సీపీఎం నేత మధు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం :

నాలుగేళ్లు అయ్యాకనే మనకివ్వాల్సింది మనం అడిగితే ఇంత పెడసరిగా వెళుతున్న వారు తొలిరోజు నుంచే నేను దూకుడుగా వెళ్లివుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది కాదా. అలా చేసి వుంటే ‘సీయం కాస్త ఓపిక పట్టివుంటే బావుండేది, దూకుడుగా వెళ్లకుండా నెమ్మదిగా ప్రయోజనాలు రాబట్టుకుంటే బావుండేది. దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశార’ని అప్పుడు మీరే అనేవారు. ఇది పసిగుడ్డు లాంటి రాష్ట్రం. మొదటి నుంచి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అంత జాగ్రత్తగా ఉన్నాం.
అందరూ కలిసి వుండాల్సిన మంచి వాతావరణాన్ని రాష్ట్రాలవారీగా రెచ్చగొట్టి కలుషితం చేస్తున్నారు (లోక్‌సభలో ఇవాళ జరిగిన వివాదం గురించి).

సీపీఐ నేత రామకృష్ణ:

స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని కేంద్రం చెప్పినప్పుడే టీడీపీ బయటపడాల్సివుంటే బావుండేది.
ముఖ్యమంత్రి చంద్రబాబు:
స్పెషల్ కేటగిరి స్టేటస్‌కు సమానంగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం వల్లనే, ఆనాడు అంగీకరించాల్సి వచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీపడలేదు. తరువాత వాళ్లు ఒక్కొక్కటీ డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు. ఈఏపీ అన్నారు. ఇప్పుడు స్పెషల్ పర్సస్ వెహికిల్ అంటున్నారు.

కాంగ్రెస్ నేత:

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెబుతూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఇప్పటికీ ఆ డిమాండుకు కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అందర్నీ ఏకం చేసి కేంద్రంపై పోరాడాలని ప్రయత్నించడం అభినందనీయం. ఆనాడు మన్మోహన్‌సింగ్ సభలో ఇచ్చిన హామీ అమలుకు కట్టుబడి ఉంది.

కాంగ్రెస్ నేత గౌతమ్ :

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాల అమలుకు జరిగే ఎటువంటి పోరాటానికైనా కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.

లోక్‌సత్తా నేత:

రాష్ట్ర రాజకీయాలకు ట్రెండు సెట్టర్ ఎన్టీరామారావు. ఆ స్థాయి రాజకీయాలకు మనం కట్టుబడి ఉండాలి. ఇవాళ దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి భారతీయ జనతా పార్టీ విఘాతం కలిగిస్తోంది. రాష్ట్రంలో అయోమయం ఉంది. ఎవరు ఎవరితో జత కలుస్తున్నారో అర్థం కానీ అయోమయం ఇది. అనుభవజ్ఞులడైన రాజకీయ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అయోమయాన్ని తొలగించాలి.
సీఐఐ ప్రతినిధి:
ఆంధ్ర మేథావుల సంఘం చలసాని శ్రీనివాస్:

ఆంధ్రులకు అన్యాయం జరిగిందనే విషయంలో అందరూ ఏకమైతేనే హక్కుల సాధన కోసం ముందుకు వెళ్లగలుగుతాం. ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు తగ్గి ఈ సమావేశానికి రాని జనసేన, వైసీపీలను ఆహ్వానించండి. జీఎస్‌టీ అంశంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది.

మరో ప్రతినిధి:

పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీకి, పార్లమెంటులో చేసిన చట్టానికి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విలువ లేదని ఈ రాష్ట్రంలో యువత నిరాశ, నిస్పృహలతో ఉంది. విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు వెంటనే తొలగించాలి.

జర్నలిస్టుల సంఘం నేత ఐ.వి. సుబ్బారావు:

జర్నలిస్టులందరం కలిసి ఐక్య ఉద్యమానికి మద్దతు ఇస్తాం.

రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ :
అవిశ్వాసం పెడతామంటేనే బీజేపీ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. మీరు చొరవ తీసుకుని ముందుకు పదండి. మేము మీ అడుగులో అడుగు వేస్తాం

ఫార్వర్డ్ బ్లాక్ ప్రతినిధి:

మోడీకి దీటైన ప్రత్యామ్నాయం చంద్రబాబు అనే మాట ప్రజలలో వినిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేసి కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతు ఇస్తాం. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి ఎన్ని సమస్యలు వచ్చినా రాష్ట్రంలోని వ్యాపార వర్గాలన్నీ మాకు సమర్ధుడైన నేత చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతోనే నెట్టుకొస్తున్నాయి.

ఆప్ పార్టీ నేత:

కేంద్రంలో గ్యాంగ్‌స్టర్ తరహా పాలకులు ఉన్నారు. ఒక వారం రోజులు ఢిల్లీలో ఉండి మీరు చక్కబెడితే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది.

ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వి. భాస్కరరావు :

పాలనా వ్యవహారాలను మీరు చక్కబెడుతున్న తీరు ప్రశంసనీయం. పొరుగున ఉన్న తమిళనాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలతో మంచి సంబంధాలు నెరపుతూ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకుంటుంది. మీరు కూడా మొదటి నాలుగేళ్లూ కేంద్రంతో సయోధ్యగా ఉంటూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేశారు.

RELATED NEWS

Comment