గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిశారు. మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్ళిన కేసీఆర్‌ గవర్నర్‌తో ఏకాంతంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఏడు జోన్లు, రెండు మల్టిజోన్లకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి విన్నవించిన విషయాన్ని కేసీఆర్‌ గవర్నర్‌తో చెప్పారు. జోన్ల విష యంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదముద్ర వేసి రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుందని ఇది ఆమోదం పొందిన వెంటనే గెజిట్‌ నోటిఫి కేషన్‌ వెలువడుతుందని కేసీఆర్‌ తెలిపారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారని విభజన సమస్యల అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంటుందన్న భరోసా ఇచ్చారని కేసీఆర్‌ చెప్పారు. రాజ్‌నాథ్‌ సింగ్‌తో చర్చించిన వివిధ అంశాలను కూడా కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. జూన్‌ 2వ తేదీన ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్ళు పూర్తవుతుందని ఈ నాలుగేళ్ళలో అనేక కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేయడంతో పాటు ప్రజల వద్దకు తీసుకు వళ్ళామని గుర్తుచేశారు. రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకులకు హాజరు కావాలని కేసీఆర్‌ గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న కార్య క్రమాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ఊహించని దానికన్నా విజయవంతమైందని రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తోందని చెప్పారు. పట్టాదారు పాస్‌పుస్తకాల సమస్య తీరిపోయిందని రైతులు ఈ పుస్తకాలను భద్రంగా దాచుకుని మురిసిపోతు న్నారని గవర్నర్‌కు చెప్పారు. విదేశాల్లో ఉన్న పట్టాదారులకు కూడా రైతుబంధు పథకం వర్తింపజేస్తున్నామని వారికి ప్రత్యేకంగా చెక్కులను అందజేసేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. గవర్నర్‌తో రాష్ట్రానికి వివిధ అంశాలను కూడా చర్చించినట్టు సమాచారం.

RELATED NEWS

Comment