దసరా కింగ్‌... మన వీరరాఘవుడు....!!!

దసరా కింగ్‌... మన వీరరాఘవుడు....!!!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కి, దసరా సెంటిమెంట్‌ బాగా కలిసి వచ్చినట్లుంది. విజయదశమి సీజన్‌కి విడుదలయిన ఆయన సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. గతంలో ఆయన దసరా కానుకగా రెండు సినిమాలను రిలీజ్‌ చేశాడు. తొలిసారిగా విజయదశమి బరిలో ఆయన బృందావనంతో బాక్సాఫీస్‌ దగ్గరకు వచ్చాడు.. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. భారీ ఓపెనింగ్స్‌ను పొందింది.. తారక్‌ కెరీర్‌లోని టాప్‌ బ్లాక్‌ బస్టర్స్‌లో ఇది ఒకటి. తన మాస్‌ ఇమేజ్‌కి పూర్తి భిన్నంగా క్లాస్‌గా, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు యంగ్‌టైగర్‌. బృందావనంతో తారక్‌ తన  కెరీర్‌ని నిలబెట్టుకున్నాడు.. ఎలాంటి రోల్‌ పోషించేందుకయినా తనకు తాను రెడీ అని దర్శకులకు గ్రీన్‌ సిగ్నల్‌ పంపాడు. 
 
 
ఇక, దసరా రేస్‌లో బాక్సాఫీస్‌ దగ్గరకు వచ్చిన తారక్‌ మరో మూవీ.... జై లవకుశ.. తారక్‌ కెరీర్‌లోనే మొదటిసారిగా నటించిన తొలి త్రిపాత్రాభినయం మూవీ.. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తారక్‌ వరస విజయాల పరంపరను కంటిన్యూ చేసింది. సరిగ్గా ఏడాది తర్వాత ఎన్టీఆర్‌ మరోసారి అరవింద సమేత వీరరాఘవుడిగా వచ్చాడు.. ఈ సినిమాకి భారీ రెస్పాన్స్‌ వచ్చింది.. సినిమా భారీ హిట్‌ అయ్యే చాన్స్‌లు ఉన్నాయని అనానిమస్‌ టాక్‌ లభిస్తోంది.. దసరా బరిలో చిన్న సినిమాలు మినహా బడా చిత్రాలేవీ లేవు.. దీంతో, అరవింద సమేత ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.. మొత్తమ్మీద, దసరా కింగ్‌గా మారాడు తారక్‌.. ఇకపై యంగ్‌టైగర్‌ విజయదశమి కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. 
 
 
 
 
 

RELATED NEWS

Comment