ఏపీలో జిల్లాకో శిల్పారామం

ఏపీలో జిల్లాకో శిల్పారామం

ఏపీలో జిల్లాకో శిల్పారామం: మ‌ంత్రి భూమా అఖిల ప్రియ‌తెలుగు వైభ‌వం చాటాల‌న్న‌ది సీఎం ల‌క్ష్యం
 తెలుగు వైభ‌వాన్నిప్ర‌తిబింబించే శిల్పారామాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌తి జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామ‌ని ఏపీ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. గ‌తంలో హైద‌రాబాదులో మాత్ర‌మే ఉన్నశిల్పారామంను విభ‌జ‌న త‌ర్వాత ఇక్క‌డ అన్ని జిల్లాల‌లో ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక‌ల్పించార‌న్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి అఖిల ప్రియ స‌మాధానం ఇస్తూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జిల్లాకో శిల్పారామం ఏర్పాటు త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందులో క‌ళ‌లు, తెలుగు జాతి సంస్కృతి వైభ‌వాన్ని పున‌రుజ్జీవంప చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. శిల్పారామంలో బొమ్మ‌లు, బుట్ట‌లు, బ‌ట్ట‌ల నేత క‌ళారూపాలు త‌యారు చేసేవారు ద‌ళారులు లేకుండానే నేరుగా వారి ఉత్ప‌త్తులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. ఇప్ప‌టికే విశాఖ‌, క‌డ‌ప‌, తిరుప‌తి, పులివెంద‌ల‌, పుట్ట‌పర్తిల‌లో శిల్పారామాలు ఉన్నాయ‌ని, వాటి పున‌రుద్ధ‌ర‌ణ‌కు 5 కోట్ల రూపాయ‌లు వినియోగిస్తున్నామ‌న్నారు. ఇక కొత్త‌గా విజ‌య‌న‌గ‌రంలో రూ.1.93 కోట్ల‌తో, గుంటూరు, కోటిన్న‌రతో ప‌నులు ఈ నెలాఖ‌రుకు పూర్త‌వుతాయ‌ని అఖిల ప్రియ తెలిపారు. కాకినాడ‌లో శిల్పారామం 2.30 కోట్ల‌తో ఆగ‌స్టులో పూర్త‌వుతుంద‌ని చెప్పారు. క‌ర్నూలులో శిల్పారామం నిర్మాణానికి ప‌రిపాల‌నా అనుమ‌తులు వ‌చ్చాయ‌ని, స్థ‌ల సేక‌ర‌ణ చేయాల్సి ఉంద‌న్నారు. అలాగే, శ్రీకాకుళం, ప‌శ్చిమ గోదావ‌రి, నెల్లూరు జిల్లాలో స్థ‌ల కేటాయింపులు పూర్త‌య్యాయ‌ని, ఇక నిర్మాణాలు చేయాల్సి ఉంద‌న్నారు. 
 
 

RELATED NEWS

Comment