సైకిల్ యాత్రకు విశేష స్పందన.. -మంత్రి జావహర్

సైకిల్ యాత్రకు విశేష స్పందన.. -మంత్రి జావహర్

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష లో భాగంగా చేస్తున్న సైకిల్ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు.

కొవ్వురు నియోజకవర్గం కొవ్వూరు మండలం పసివేదల,నందమూరు గ్రామాల్లో శనివారం సైకిల్ యాత్ర జరిగింది.ఏపీని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో 5 కోట్ల ఆంధ్రులు గ్రహించారు.తెలుగు ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తుంటే ప్రతిపక్ష నేత విమర్శించటం తగదు.

ప్రత్యేక హోదా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధ పడతామని ఆంధ్రులు చెప్పటంతో కేంద్రానికి భయం పట్టుకుంది.తిరుపతిలో ఈనెల 30న తలపెట్టిన ధర్మ పోరాట యుద్ధ మహాసభకు ప్రతి ఒక్కరూ రావాలని మంత్రి జవహర్ పిలుపునిచ్చారు.

RELATED NEWS

Comment