8కె కెమెరాతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న‌ తొలి సినిమా `యు`

8కె కెమెరాతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న‌ తొలి సినిమా `యు`

 
 
 
కొవెర  హీరోగా త‌నికెళ్ల భ‌ర‌ణి, `శుభ‌లేఖ‌` సుధాక‌ర్ ముఖ్య పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం `యు`. దీనికి ఉప‌శీర్షిక `క‌థే హీరో`. శ్రీమ‌తి నాగానిక స‌మ‌ర్ప‌ణ‌లో కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై కొవెర ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌ల‌క్ష్మి కొండా, నాగానికి చాగారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకొంటోంది.
నిర్మాత‌లు విజ‌య‌ల‌క్ష్మి కొండా, నాగానికి చాగం రెడ్డి మాట్లాడుతూ `` `యు` అంటే అండ‌ర్ వ‌రల్డ్. ఇప్ప‌టివ‌ర‌కూ అండ‌ర్ వ‌ర‌ల్డ్ కాన్సెప్ట్ తో 
చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ, ఈ త‌ర‌హాలో ఎవ‌రూ చేయ‌లేదు. హాలీవుడ్‌లో కూడా ఈ త‌ర‌హాలో రాలేదు. ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు ఈ క‌థ విని త‌న స‌ల‌హాలు , సూచ‌న‌లు ఇచ్చారు. ఇందులో మొత్తం నాలుగు పాట‌లున్నాయి. త్వ‌ర‌లో పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. జూలై నెలాఖ‌రున గానీ, ఆగ‌స్టు మొద‌టివారంలో గానీ  చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అని తెలిపారు.
హీరో - ద‌ర్శ‌కుడు కొవెర మాట్లాడుతూ ``8కె కెమెరాతో షూటింగ్ మొత్తం జరుపుకొన్న తొలి తెలుగు సినిమా మాదే. నాకు తెలిసి ఇండియాలో కూడా ఇదే తొలి సినిమా అవుతుంది. 2017మే నెల‌లో రెడ్ హీలియ‌మ్ 8కె కెమెరా విడుద‌ల కాగా, మేం ఆగ‌స్టు నుంచి ఆ కెమెరాతో షూటింగ్ స్టార్ట్ చేశాం. మా త‌ర్వాత ఈ కెమెరాతో కొన్ని సినిమాలు షూట్ చేసినా పాట‌లకు, కొన్ని ఎపిసోడ్స్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. హై క్వాలిటీ అవుట్‌పుట్ కావ‌డంతో బిగ్ బిడ్జెట్ సినిమా రేంజ్‌లో చాలా  4 టీబీ హార్డ్ డిస్క్ లు ఉప‌యోగించాం. 8 కె వ‌ల్ల సినిమా క్వాలిటీ ఎక్స్ ట్రార్డిన‌రీగా వ‌చ్చింది. ఇది చాలా చిన్న సైజ్ కెమెరా. లైట్స్ ఎక్కువ వాడ‌కుండా ఎలాంటి షాట్స్ నైనా చాలా ఈజీగా తీసేయొచ్చు. మా కెమెరామేన్ రాకేష్ గౌడ్ ఈ కెమెరా గురించి చెప్పాడు. రాకేష్ గౌడ్ కి కెమెరామేన్‌గా ఇదే తొలి సిన‌మా. ఆయన ఇంత‌కు ముందు రామ్‌గోపాల్‌వ‌ర్మ తీసిన కొన్ని సినిమాకు డీఐ వ‌ర్క్ చేశారు`` అని చెప్పారు.
హిమాన్సీకాట్రగడ్డ ​
, జ‌బ‌ర్ద‌స్త్ రాఘ‌వ‌, జ‌బ‌ర్ద‌స్త్ నాగి, రోహిణి, సంధ్య‌, స్వ‌ప్న‌రావ్‌, ల‌హ‌రి, దొర‌బాబు, కోయ కిశోర్ త‌దిత‌రులు ఈ సినిమాకు ప్ర‌ధాన తారాగ‌ణం.
ఈ చిత్రానికి సంగీతం: స‌త్య మ‌హావీర్‌, ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి, కెమెరా:  రాకేష్‌
​ గౌడ్ ​, స్క్రీన్ ప్లే : కొవెర‌ 
మ‌ధు విప్ప‌ర్తి, సంభాష‌ణ‌లు: మ‌హి ఇల్లింద్ర‌, క‌రుణ్ వెంక‌ట్‌, ఆర్ట్ : జ‌య‌దేవ్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌​లు ​:  ​ఏ ఆర్ శౌర్య ,
 శివ గ‌ణ‌ప‌ర్తి, స‌హ నిర్మాత‌:  మూర్తి నాయుడు పాదం, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం:  కొవెర‌.

RELATED NEWS

Comment