గౌతం రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ -అధికార ప్రతినిధి పార్థసారధి.

గౌతం రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ -అధికార ప్రతినిధి పార్థసారధి.

వంగవీటి మోహన్ రంగా గురించి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైయస్ఆర్ సీపీ
పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ఆదేశానుసారం గౌతమ్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ
అనవసర వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో ఎంతస్థాయి వారినైనా ఉపేక్షించమన్న వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పార్థసారధి.

వైయస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గౌతం రెడ్డి విజయవాడలో ఓ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారని వాటి ప్రోమోలు విడుదల అయ్యాయని వాటిలో ఆయన వంగవీటి రంగా, రాధాలను ఉద్దేశించి చేసిన అభిప్రాయాలను వైయస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పార్థసారధి తెలిపారు. దివంగత నాయకుడు వంగవీటి రంగాను, పార్టీ నాయకుడు మల్లాది విఘ్ణ గురించి చేసిన అభిప్రాయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా దివంగత నాయకుడు వంగవీటి రంగా గారిని మేం అందరూ అభిమానిస్తామని, రాష్ట్రంలోని పేదవర్గాలు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తారని తెలిపారు. రంగాను ఉద్దేశించి గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్థసారధి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగా గురించి గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ తీవ్రంగా పరిగణించిందని ఈ సందర్భంగా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయటం జరిగిందని పార్థసారధి తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా సరే..ఏ వ్యక్తి గురించి కానీ, ఏ వర్గం గురించి కించపరిచి మాట్లాడితే తీవ్రంగా పరిగణించబడుతుందని వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని ఈ సందర్భంగా పార్థసారధి తెలిపారు. మరోసారి వంగవీటి మోహన రంగా గురించిగౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్థసారధి స్పష్టం చేశారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ప్రస్తుతం వైయస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్నారని వారు వచ్చిన తర్వాత
తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని పార్థసారధి తెలిపారు. ఇంటర్వ్యూను ప్రసారం చేయబోయే ఛానల్ కూడా పార్టీ అభిప్రాయం తెల్సుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గౌతం రెడ్డి వంగవీటి రంగా, రాధాలపై మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు.

RELATED NEWS

Comment