గన్నవరంలో కేసీఆర్‌కు ఘనస్వాగతం

గన్నవరంలో కేసీఆర్‌కు ఘనస్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనక దుర్గమ్మకు ముక్కు పుడకను సమర్పించుకుంటానని కేసీఆర్‌ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌ దుర్గగుడికి వస్తారంటూ ప్రతి దసరా సమయంలో ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఆయన అమ్మవారికి మొక్కు తీర్చుకునేందుకు విజయవాడ వచ్చారు. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన అమ్మవారికి ముక్కుపుడక సమర్పించనున్నారు. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.

RELATED NEWS

Comment