రాములమ్మకు గ్రీన్ సిగ్నల్ ?

రాములమ్మకు గ్రీన్ సిగ్నల్ ?

సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిని ఏఐసీసీ కార్యదర్శిగా నియమించేందుకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఆమె రాహుల్ తో సమావేశమైనప్పుడు ఈ పదవిలో ఆమె నియామకాన్ని ఆయన ఆమోదించినట్టు సమాచారం. ఆయనతో విజయశాంతి భేటీ అయినప్పుడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణా పార్టీ వ్యవహారాల ఇన్-చార్జ్ కుంతియా కూడా ఉన్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి రాములమ్మ గట్టి కృషి చేస్తారని పార్టీ నాయకత్వం భావిస్తోంది. 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి ఆమె సినీ గ్లామర్ తోడ్పడుతుందని రాహుల్ ఆశిస్తున్నట్టు చెబుతున్నారు.ఇందులో భాగంగానే ఏఐసీసీలో ఆమెకు కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది

RELATED NEWS

Comment