మహేష్ బర్త్ డేకి గుంటూరు కారం స్పెషల్ గిఫ్ట్

మహేష్‌ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న థర్డ్ మూవీ గుంటూరు కారం. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ నిర్మిస్తోంది. చాలాకాలంగా షూటింగ్ సా.. గుతూ వస్తోన్న గుంటూరు కారం అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ గరమ్ గా ఉన్నారు. వారిని చల్లబరిచేందుకు త్రివిక్రమ్ .. సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నాడు.

యస్.. ఈ పాట అవుతుందా లేదా అని అంతా అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ దగ్గరుండి మరీ తమన్ తో పాటు చేయిస్తున్నాడు. ఆల్మోస్ట్ బర్త్ డేకు ఇది రెడీ అవుతుందని టాక్. ఇక ఫస్ట్ సాంగ్ కాబట్టి ఖచ్చితంగా నెక్ట్స్ లెవల్ లో ఉండేలా ఉంటేనే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారు.

లేదంటే ఆ వైపు నుంచి ప్రాబ్లమ్స్ తప్పవు. ఇప్పటికే తమన్ ను మార్చాలని అందరూ చెబుతున్నారు. అటు మహేష్ కూడా తమన్ విషయంలో అంత సంతృప్తిగా లేడు అనే వార్తలున్నాయి. అంచేత ఈ పాటతో తమన్ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా చెబితే ఫస్ట్ సాంగ్ తోనే అల వైకుంఠపురములో సినిమాకు ఎంత బజ్ తెచ్చాడో అంతకు మించిన ప్రయత్నం చేయాలిప్పుడు.