చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 6 

చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 6 

 సంఘటనలు 

  • 1896: 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.
  • 1909: భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు.
  • 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది

జననాలు 

  • 1773: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త. (మ.1836)
  • 1886: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాం. (మ.1967)
  • 1922: శ్రీభాష్యం అప్పలాచార్యులు, వక్త మరియు సాహితీ వ్యాఖ్యాత.
  • 1928: జేమ్స్ వాట్సన్, DNAను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త.
  • 1931: నల్లమల గిరిప్రసాద్, ప్రముఖ కమ్యూనిస్టు నేత. (మ.1997)
  • 1954: ఆడారి వెంకటరమణ (దీపశిఖ), ప్రముఖ కథా రచయిత.
  • 1956: దిలీప్ వెంగ్‌సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

 మరణాలు 

  • 1989: పన్నాలాల్ పటేల్ ప్రముఖ గుజరాతీ భాషా రచయిత.
  • 1992: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత మరియు బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (జ.1920)
  • 2011: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)

RELATED NEWS

Comment