చరిత్రలో ఈరోజు జనవరి 8

చరిత్రలో ఈరోజు జనవరి 8

సంఘటనలు

  • 1025 : సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
  • 1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యమైంది.
  • 1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.

జననాలు

  • 1889: మామిడిపూడి వేంకటరంగయ్య, ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)
  • 1912: చెలమచెర్ల రంగాచార్యులు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)
  • 1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
  • 1942: స్టీఫెన్ విలియం హాకింగ్, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త
  • 1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత మరియు అరేంజర్. (మ.2016)
  • 1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)
  • 1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.
  • 1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
  • 1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.

మరణాలు

  • 1642: గెలీలియో, ప్రముఖ ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)
  • 1995:మధు లిమాయె ప్రముఖ భారత రాజకీయనేత. (జ.1922)
  • 2015: గెడ్డాపు సత్యం, ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.

RELATED NEWS

Comment