చరిత్రలో ఈరోజు మార్చి 6

చరిత్రలో ఈరోజు మార్చి 6

సంఘటనలు

  • 2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
  • 1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.
  • 1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.

జననాలు

  • 1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు. (మ.1564)
  • 1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి. (మ.1949)
  • 1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు
  • 1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు. (మ.1966)
  • 1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
  • 1933: కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి.

మరణాలు

  • 1964: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)
  • 1976: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు.
  • 1995: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)
  • 2016: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. (జ.1971)

జాతీయ / అంతర్జాతీయ దినాలు

  • ఘనా గణతంత్ర దినోత్సవం.

RELATED NEWS

Comment