ఎన్టీఆర్‌ ఊచకోత... 600 మంది పట్టే థియేటర్‌లో 6000 మంది.... కడపలో ఫ్యాన్స్‌ హంగామా...!!!

ఎన్టీఆర్‌ ఊచకోత... 600 మంది పట్టే థియేటర్‌లో 6000 మంది.... కడపలో ఫ్యాన్స్‌ హంగామా...!!!

ఎన్నాళ్లనుంచో వెయిట్‌ చేస్తున్న కాంబినేషన్‌ సెట్‌ అయింది.. తాజాగా థియేటర్లలోకి కూడా వచ్చేసింది. సినిమా తొలి షో పడిందో లేదో... అనానిమస్‌ టాక్‌ వినిపిస్తోంది.. బొమ్మ సూపర్‌ హిట్‌.. డౌట్‌ లేదు.. సినిమా బ్లాక్‌ బస్టర్‌... ఇది అరవింద సమేత వీరరాఘవ మూవీ కాదని, త్రివిక్రమ్‌ సమేత తారక్‌ అని ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.. అటు తారక్‌ సినిమాకి, ఇటు త్రివిక్రమ్‌ మూవీకి గతంలో ఎన్నడూ లేని రేంజ్‌లో ఓపెనింగ్స్‌ కుమ్మేశాయి.. గతంలో ఆది సినిమాతో ఫ్యాక్షనిజం బ్యాక్‌ డ్రాప్‌లో మీసం కూడా సరిగ్గా మొలవని స్టేజ్‌లో మేజిక్‌ చేశాడు తారక్‌.. ఈసారి ఆయన మెచ్యూర్డ్‌ ఏజ్‌లో పోషించిన వీరరాఘవరెడ్డి పాత్రతో మరోసారి ఫ్యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమాతో బాక్సాఫీస్ దగ్గరకు వచ్చాడు.. కథ సేమ్‌ అయినా కంటెంట్‌లో తేడా ఉంది.. ఆది వివి వినాయక్‌ మూవీ స్టయిల్‌ మూవీ అయితే, అరవింద సమేత.. త్రివిక్రమ్‌ మార్క్‌ నారేషన్‌తో రిలీజ్ అయింది.. 
 
 
మూవీకి అనానిమస్‌గా పాజిటివ్‌ రావడంతో ప్రేక్షకులు థియేటర్లలోకి క్యూలు కడుతున్నారు.. ముఖ్యంగా తమ నేటివిటీ, బ్యాక్‌ డ్రాప్‌ సినిమా కావడంతో రాయలసీమలో అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది మూవీకి. ఈ చిత్రంలో తారక్‌ ఫుల్‌ లెంగ్త్‌తో రాయలసీమ యాసతో డైలాగులు చెప్పాడు. ఇప్పటిదాకా తెలంగాణ యాసతో హీరోలు, విలన్లు డైలాగులు చెప్పిన సినిమాలు వచ్చాయి. కానీ, సీమ యాసతో హీరో డైలాగులు డెలివర్‌ చేయడం ఇదే తొలిసారి. ఇటు పాటల్లోనూ అదే ప్రాంతపు మాండలికం, భాష, యాసతోపాటు కట్టు, బొట్టు  కనిపిస్తుందని తన ఇంటర్‌వ్యూలలో తేల్చి చెప్పాడు త్రివిక్రమ్‌. అందుకే, సీమలో ఆడియెన్స్‌ క్యూలు కడుతున్నారు మూవీకి. కడపలోని ఓ థియేటర్‌లో కేవలం 600 మంది ఆడియెన్స్‌ ఉన్న థియేటర్లో ఏకంగా 6 వేల మంది కూర్చున్నారట.. అంటే సినిమాకి ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వుందో, ఓపెనింగ్స్‌ ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.... ఇదే ఊపు దసరా వరకు కొనసాగితే టాలీవుడ్‌ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం..

RELATED NEWS

Comment