మహానటి’లో కీర్తి లుక్స్ ఎన్నో తెలిస్తే...

మహానటి’లో కీర్తి లుక్స్ ఎన్నో తెలిస్తే...

నవరాత్రులు అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తొమ్మిది లుక్స్‌లో కనిపించి సంచలనం సృష్టించారు. దశావతారం సినిమాలో కమల్ హాసన్ 10 లుక్స్‌లో కనిపించి ఆశ్చర్యపరిచారు. తాజాగా మహానటి సినిమాలో కీర్తి సురేష్ 110 డిఫరెంట్ లుక్స్‌ను కనబరిచింది. ఆశ్చర్యంగా అనిపించినా మీరు చదువుతున్నది అక్షరాల నిజం. డైరెక్టర్ నాగ అశ్విన్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 110 రకాలుగా కీర్తి కనిపించి సావిత్రి పాత్రకు కీర్తి న్యాయం చేసిందని ఆయన తెలిపారు.

మే 9న రిలీజ్ కాబోయే ఈ బయోపిక్‌లో కీర్తి 110 లుక్స్‌నూ చూడవచ్చు. ఇప్పటికే చిత్రబృందం కీర్తి లుక్స్‌కు సంబంధించిన 20 పోస్టర్లను, స్టిల్స్, టీజర్‌ను రిలీజ్ చేసింది. ప్రతి ఒక్క పోస్టర్‌లో కీర్తి.. సావిత్రిని తలపించింది. కీర్తి అలా కనిపించడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

RELATED NEWS

Comment