ఇది అవమానం కాదు....అన్యాయం కాదు...మరేంటి??

ఇది అవమానం కాదు....అన్యాయం కాదు...మరేంటి??

గత సంవత్సరం సోషల్ మీడియాలో యువత వైజాగ్ లో మానవహారంగా ఏర్పడి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలి అని పిలుపు ఇవ్వటం...అది ఉధృతమవటం జరిగింది.... ట్విట్టర్ వేదిక గా ఆనాడు నన్ను..నీకు బాధ్యత లేదా? నీ విజయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరణ లేదా అని ప్రశ్నించి నా బాధ్యత గుర్తు చేశారు...మీరు తలపెట్టబోయే ఆ ఉద్యమానికి నేను వస్తాను అని మాట ఇచ్చాను.

ఈ రోజు సినిమా వాళ్ళకి బాధ్యత లేదా అని ప్రశ్నించిన గౌరవ రాజేంద్రప్రసాద్ గారికి నేను విన్నవించేది ఏమిటంటే...ఆ నాడు ఉద్యమానికి సంఘీభావంగా శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, సందీప్ కిషన్ గారు, నిఖిల్ గారు ఇలా ఎందరో యువ హీరోలు మద్దతుగా ట్వీట్లు వేశారు.

అంతర్జాతీయ సమ్మిట్ కారణంగా ఆ రోజు కాకుండా వేరొక రోజు మీ ఉద్యమాన్నీ వాయిదా వేసుకోండి అని నాకు ఆలస్యంగా తెలిపారు. కానీ ఆ ఉద్యమానికి నాయకులంటూ లేరు. యువతే నాయకత్వం వహించింది. మాట ఇచ్చి సమ్మిట్ కారణంగా నేను రావడం లేదు అని చెప్పటం అన్యాయం అవుతుంది. వస్తే అరెస్ట్ చేస్తారని తెలిసినా వెళ్లటం జరిగింది.

అంతర్జాతీయ ప్రతినిధులు వైజగ్ లో వున్నప్పుడు వారి శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ వారి బాధ్యత. అందులో బాగంగానే నన్ను అరెస్ట్ చేసి సెల్ లో పెట్టటం జరిగిందని భావిస్తున్నాను. అందులో ఎటువంటి తప్పు లేదని మనసావాచా నమ్ముతున్నాను.

ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ విషయంలో, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ విషయంలో మనకి జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ...పార్టీలకి అతీతంగా ఎవరు పిలిచినా మీతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క ఫోన్ కాల్ తో అందుబాటులో ఉంటాను.

సదా మీ ప్రేమకి బానిస
మీ సంపూర్ణేష్ బాబు.

RELATED NEWS

Comment