జనసేన`చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` విడుదల

జనసేన`చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` విడుదల

`చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేసింది జనసేన. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్న సందర్భంగా.. ఈ గీతాన్ని విడుదల చేశారు. పర్యటనలో భాగంగా బుధవారం వైజాగ్ లో పర్యటిస్తే… రెండో రోజు పోలవరంలో.. మూడో రోజు విజయవాడలో పర్యటించనున్నారు. తన పర్యటనలలో భాగంగా సమస్యల పరిశీలన, అధ్యయనం, వాటిని అవగాహన చేసుకోనున్నట్టు తెలిపారు. రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో మూడో విడత పర్యటన పోరాటానికి వేదిక కానుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

RELATED NEWS

Comment