జయజానకి నాయక రివ్యూ

జయజానకి నాయక రివ్యూ

రివ్యూ : జయజానకి నాయక
తారాగణం : శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్, జగపతిబాబు, శరత్ కుమార్, నందు, తరుణ్ అరోరా, చలపతిరావు, వాణీవిశ్వనాథ్ ..
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ : రిషీ పంజాబీ
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నిర్మాత : ఎమ్. రవీందర్ రెడ్డి
మాటలు : ఎమ్ రత్నం
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్వకత్వం : బోయపాటి శ్రీను
జానర్ : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్
రిలీజ్ డేట్ : 11.08.17


హై ఎండ్ యాక్షన్ ఎమోషన్స్ ను వెండితెరపై ప్రెజెంట్ చేయడంలో బోయపాటి శ్రీను సిద్ధహస్తుడు. అతని సినిమాలన్నింటిలోనూ ఈ తరహా ఫార్ములాతోనే సక్సస్ చేశాడు. కథలు మరీ గొప్పవి కాకపోయినా వాటికి

తనదైన స్టైల్లో జోడించే ట్రీట్మెంటే బోయపాటి సినిమాలను స్పెషల్ గా మారుస్తాయి. అయితే ఇప్పటి వరకూ స్టార్ హీరోలనే డైరెక్ట్ చేసిన బోయపాటి ఫస్ట్ టైమ్ ఓ కుర్రాడితో అలాంటి హై ఎండ్ యాక్షన్ ఎంటర్టైనర్

చేశాడు. మరి ఈ కుర్రాడితో చేసిన జయజానకి నాయక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
గగన్(శ్రీను) కాలేజ్ కుర్రాడు.. స్వీటీ(రకుల్) చదివే కాలేజ్ లో చదువుతుంటాడు. చాలా నెమ్మదస్తుడు, తండ్రి, అన్నయ్య అంటే ప్రాణం.. ఓ రోజు తన కాలేజ్ అమ్మాయిని ఓ మినిస్టర్ కొడుకు ఏడిపిస్తుంటే వాడ్ని

కొట్టి బుద్ధి చెబుతాడు గగన్. అది నచ్చిన స్వీటీ అతనితో స్నేహం చేస్తుంది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఈ ప్రేమ నచ్చని స్వీటీ ఫాదర్ ఆమెను అశ్విత్ నారాయణ్ వర్మ(జగపతిబాబు) అనే బిజినెస్

మాగ్నెట్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ తాళి కట్టిన మరుక్షణమే అతన్ని చంపేస్తాడు అరుణ్ పవార్ అనే లిక్కర్ మాఫియా కింగ్. అశ్విత్ నారాయణ్, అరుణ్ పవాల్ ల మధ్య వార్ ఎందుకు మొదలైంది.

తాళికట్టగానే భర్తను కోల్పోయిన స్వీటీ పరిస్థితి ఏంటి..? స్వీటీకోసం గగన్ ఏం చేశాడు.. స్వీటీ వల్ల అరుణ్, అశ్విత్ లకు గగన్ ఎలా కామన్ ఎనిమీ అయ్యాడు. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి గగన్ ఎలా

బయటపడ్డాడు.. తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగతా కథ..


విశ్లేషణ :

బోయపాటి సినిమాల్లో హీరోలు ఏదైనా సమస్య వచ్చేంత వరకే కామ్ గా ఉంటారు. కానీ ఆ టెంపర్ మాత్రం ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది. ఇందులోనూ అంతే. హీరో కాలేజ్ కుర్రాడైనా అన్యాయాన్ని సహించలేడు.

ఈ సినిమా కథ కూడా అలాగే మొదలవుతుంది. కొన్ని కాలేజ్ సీన్స్, ఓ ఫైట్, పాట అంటూ వెళుతుంటుంది.. కానీ ఎప్పుడైతే ఇద్దరు విలన్స్ కథలోకి ఎంటర్ అవుతారో.. కథనంలోనూ మార్పు వస్తుంది. ఈ లోగా

హీరో, హీరోయిన్ల మధ్య లవ్ డెవలప్ అయ్యే సీన్స్ అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఫార్ములా ప్రకారం కథనం అల్లుకుంటూ వెళ్లాడు బోయపాటి. ఈ లోగా ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా అదిరిపోయే ఫైట్

సీన్స్ తో అదరగొట్టాడు. ఎప్పుడైతే హీరోహీరోయిన్ లవ్ బ్రేకప్ అవుతుందో.. అక్కడి నుంచి కథ కంప్లీట్ గా ట్రాక్ ఎక్కుతుంది. దీనికి హీరోతో సంబంధం లేకుండా విలన్స్ వేసుకునే ఎత్తులు, జిత్తులు మరింత ఇంట్రెస్ట్

పెంచుతుంటే ఆ ఊపులో కథను వైజాగ్ కు షిఫ్ట్ చేస్తాడు.. అదే టైమ్ లో బ్రేకప్ బాధను మర్చిపోవడానికి వైజాగ్ వస్తాడు హీరో. అదే టైమ్ లో అశ్విత్ నారాయణ్ అండ్ ఫ్యామిలీపై కొందరు విలన్స్ అటాక్ చేస్తారు.

అటాకింగ్ టైమ్ లో అదే ప్లేస్ లో ఉండే హీరో వాళ్లందరినీ కాపాడతాడు.. అప్పుడే అతనికో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది.. ఫైట్ భీకరంగా ఉంటే ఆ ట్విస్ట్ షాకింగ్ గా ఉంటుంది.. ఇది చాలదూ ఇంటర్వెల్ బ్యాంగ్ తో

సెకండ్ హాఫ్ పై ఎక్స్ పెక్టేషన్స్ హెవీగా పెంచడానికి. అదే ఫార్ములా ఫాలో అయ్యాడు బోయపాటి. కొన్ని సీన్స్ కంటిన్యూటీ చూస్తే లెజెండ్, సరైనోడులోని సీన్స్ గుర్తొస్తుంటాయి కూడా. ఇక ఆ తర్వాత హీరోతో ఆ

ఇద్దరు విలన్స్ కు లింక్ వేసి.. ఆ ఇద్దరికీ హీరోయిన్ ను తర్వాత హీరోను ఎనిమీగా మార్చే సీన్స్ అదిరిపోయాయి. అక్కడి నుంచి ఒకరు పరువు కోసం ఒక విలన్, పంతంకోసం ఒక విలన్ వెంటపడుతుంటే

ప్రేమకోసం ఆ ఇద్దరినీ ఎదుర్కొనే హీరోగా కథకు కరెక్ట్ పాయింట్ సెట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత హంసల దీవిలో వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలెట్. వీటితో పాటు మధ్యలో ఎమోషనల్ సీన్స్

ఓ రేంజ్ లో వర్కవుట్ అవుతోంటే.. అప్పుడప్పుడూ వచ్చే పాటలు కథను ఏ మాత్రం డిస్ట్రబ్ చేయకుండా తీసుకువెళుతుంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ‘విల విల వాలే పొద్దుకు’ పాట

పిక్చరైజేషన్ సూపర్బ్. ఇలాంటి స్పూత్ స్టైల్ ఆఫ్ పిక్చరైజేషన్ బోయపాటి నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేం.. చాలా కూల్ గా ఉంటుందా పాట. ఇక బోయపాటి ప్రతి సినిమాలో కనిపించే కామన్ థింగ్. ఓ బలమైన

ఎమోషనల్ సీన్.. ఇది ఈ సినిమాలోనూ ఉంది. హీరో తండ్రి, అన్నను కాల్చిన తర్వాత హాస్పిటల్ లో వచ్చే సీన్.. సింప్లీ సూపర్బ్. అటు తండ్రి, ఇటు అన్న ఇద్దరినీ కాపాడుకోవడం కోసం హీరో పడే తాపత్రయంలో

పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా రాని శ్రీనివాస్ చేసినా ఆకట్టుకుంటుంది.. అదీ బోయపాటి ఎమోషన్ ను పండించే విధానం. మొత్తంగా ఊరమాస్ యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా వచ్చే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పాత్రే

హైలెట్. అసలు ఇలాంటి పాత్రకు ఒప్పుకోవడంలోనే ఆమె గొప్పదనం ఉంది. అందుకు తగ్గ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అలాగే డైలాగ్స్ అన్నీ సిట్యుయేషనల్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. ముఖ్యంగా

‘ఎవరున్నా లేకున్నా’ డైలాగ్ అండ్ అక్కడ వచ్చే సీన్ ఓ హైలెట్. అయితే ఇలాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది అస్సలు సెట్ కాదు. అయినా పెట్టారు. దీంతో అది సిగరెట్ సాంగ్ గానే మారింది. మొత్తంగా

బోయపాటి మార్క్ ఊరమాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అలరిస్తాడు జయజానకి నాయకుడు..

ఆర్టిస్టుల పరంగా.. ఖచ్చితంగా సినిమాకు శ్రీనివాస్ మైనసే.. కానీ గత రెండు సినిమాలతో పోలిస్తే బాగా డెవలప్ అయ్యాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా సింగిల్ ఎక్స్ ప్రెషన్ తోనే లాగించాడు. ఎమోషనల్ సీన్స్ లో

బాగా తేలిపోయాడు. డైలాగ్ డెలివరీ పైనా ఇంకా శ్రద్ధపెట్టాలి. కానీ డ్యాన్సులు ఇరగదీశాడు.. ఫైట్స్ లో దుమ్మురేపాడు.. స్వీటీ అలియాస్ జానకి పాత్రలో రకుల్ ప్రీత్ ఒదిగిపోయింది. జగపతిబాబు పాత్ర ఎంటర్

అయిన విధానంతో పోలిస్తే ఆ క్యారెక్టరైజేషన్ అంతబాగా ఎలివేట్ కాలేదు. మరో విలన్ గా నటించిన తరుణ్ అరోరా ఆ పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రగ్యా జైశ్వాల్ ది జస్ట్ ఒక పాటకు నాలుగు సీన్స్ కే పరిమితమయ్యే

పాత్ర. తండ్రి పాత్రలో శరత్ కుమార్, అన్నగా నందు పాత్రలూ చాలా పవర్ ఫుల్ గా మలిచాడు.. ఇద్దరూ బాగా చేశారు. కామెడీకి పెద్దగా స్కోప్ లేదు కానీ.. ఉన్నంతలో ఓకే అనిపిస్తారు..ఇతర పాత్రలన్నీ కామన్

గా వచ్చేవే..

టెక్నికల్ గా .... టెక్నికల్ గా అన్ని విభాగాలతో తనకు కావాల్సిన అవుట్ పుట్ తెచ్చుకున్న బోయపాటికే ఫస్ట్ మార్కులు పడతాయి. తర్వాత రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.. ఇంటర్వెల్ బ్యాంగ్,

హంసలదీవి ఫైట్స్ అయితే మాస్ ను ఊపేస్తాయనే చెప్పాలి.. ఇక దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పాటలు కాస్త యావరేజ్ అనిపించుకున్నా.. సినిమా అంతా వెంటాడే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ముఖ్యంగా డిఫరెంట్

మాంటెజెస్ తో మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ రిషీ పంజాబీకి మరీ ఎక్కువ మార్కులు పడతాయి. సినిమా మూడ్ హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ చేశాడు. మాటలు బావున్నాయి. కాస్ట్యూమ్స్

ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి..

ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం
ఫైట్స్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
దర్శకత్వం
సెకండ్ హాఫ్


మైనస్ పాయింట్స్ `:
ఫస్ట్ హాఫ్
కామెడీ
ఐటమ్ సాంగ్


ఓవరాల్ గా : బోయపాటి మార్క్ ఎమోషనల్ యాక్షన్ తో నాయకుడికి జయం కలిగినట్టే..

రేటింగ్ : 3.25/5
- యశ్వంత్

RELATED NEWS

Comment