ప్రభాస్‌ మిర్చి పండగలా దిగి..సింగర్‌ ఇలాంటి సెక్స్ శాడిస్టా.....???  

ప్రభాస్‌ మిర్చి పండగలా దిగి..సింగర్‌ ఇలాంటి సెక్స్ శాడిస్టా.....???  

ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అని తేడా లేకుండా ఏ వుడ్‌ చూసినా ఒకటే హడావిడి.. అదే మీ టూ మూమెంట్‌.. పని ప్రదేశాలలో  తమకు జరిగిన లైంగిక వేధింపులను మహిళలు బయటపెట్టడమే ఈ మీ టూ మూమెంట్‌.. తెలుగులో క్యాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో నటి శ్రీరెడ్డి కొన్ని రోజుల క్రితం తెలుగులో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె బయటకు వచ్చిందో లేదో... అనేకమంది జూనియర్‌ ఆర్టిస్టులు మీ టూ అంటూ మీడియా ముందుకు వచ్చారు.. తామూ బాధితులమే అని క్యూ కట్టారు.. తాజాగా కంగనా రనౌత్‌, తనూ శ్రీ దత్తా, రాధికా ఆప్టే వంటి బడా హీరోయిన్‌లు మీ టూ అంటూ తమకు జరిగిన వేధింపులను బటయకు తెస్తుండడంతో రచ్చ జరుగుతోంది.. ఇదే బాటలో ప్రభాస్‌ సినిమా మిర్చిలోని పాపులర్‌ సాంగ్‌ పండగలా దిగివచ్చావు.. ప్రాణాలకు వెలుగిచ్చావు సాంగ్‌తో బాగా పాపులారిటీ దక్కించుకున్న  సింగర్‌ కైలాష్‌ కేర్‌పై బాలీవుడ్‌కి చెందిన ఫేమస్‌ ఫొటోగ్రాఫర్‌  నటాషా హేమ్‌రజని సంచలన ఆరోపణలు చేశారు.. తనకు గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసుకున్నారు.. 
 
కొన్నాళ్లక్రితం ఓ ఇంటర్‌ వ్యూ కోసం తాను, ఓ జర్నలిస్ట్ కలిసి కైలాష్‌ ఖేర్‌ ఇంటికి ఇంటర్‌వ్యూకి వెళ్లామని, ఇంటర్‌ వ్యూ మధ్యలో కైలాష్‌ ఖేర్‌ లేచి వచ్చి తమ ఇద్దరి మధ్యలో కూర్చొని ఇద్దరి స్కర్ట్‌లపై చేయి వేశాడని... బాంబ్‌ పేల్చింది.. ఆ తర్వాత తమ థైస్‌పై చేతులు వేసి ఏదో  చేయాలనిప్రయత్నించాడని.. తాము అతడిని ఆ హడావిడిలో మునగనిచ్చి... ఫాస్ట్‌ ఫాస్ట్‌గా ఇంటర్‌ వ్యూ ముగించుకొని బయటకు వచ్చామని తెలిపింది. ఇది 2006లో జరిగందని తాజాగా బయటపెట్టడం వెనుక ఎలాంటి సీక్రెట్‌ లేదని, కేవలం దానికి ఆధారాలు లేకపోవడంతో ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నామని వివరించింది.. మొత్తమ్మీద, క్యాస్టింగ్‌ కౌచ్‌ కావొచ్చు.. మీ టూ మూమెంట్‌ కావొచ్చు.. ఇండస్ట్రీలోని టాప్‌ హీరోలు, దర్శకనిర్మాతలే కాదు.. సింగర్‌ల బాగాతోలను సైతం బయటపెడుతోంది.. మరి, ఇలాంటి వారు ఇంకెందరు బయటకు వస్తారో చూడాలి..

RELATED NEWS

Comment