యువ జర్నలిస్టులకు త్వరలో శిక్షణా తరగతులు

యువ జర్నలిస్టులకు త్వరలో శిక్షణా తరగతులు

మీడియా అడ్వైజరీ కమిటీ సమావేశం ఇవాళ అసెంబ్లీలోని కమిటీ హల్ 4 లో జరిగింది. సమావేశంలో చైర్మన్ తో సహా మొత్తం 11 మంది సభ్యులు పాల్గొన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా ఈమధ్యే నియమకమైన ఎంఏ. మాజిద్, జూన్ 2 సందర్బంగా ఉత్తమ జర్నలిస్టులుగా ప్రభుత్వ పురస్కారం అందుకొన్న వై. నాగేశ్వర్, సూరజ్ వి. భరద్వాజ్ లను అభినందిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్య గారు సమావేశాన్ని ప్రారంభించారు. మొత్తం 3 అంశాలు ప్రధాన ఎజెండాగా సభ్యుల మధ్య చర్చ జరిగింది. *ఎజెండా* 1. మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యుల కాళేశ్వరం ప్రాజెక్టు టూర్. 2. యువ జర్నలిస్టుల కోసం ఓరియెంటేషన్ తరగతుల నిర్వహణ. 3. మీడియా కమిటీ సభ్యుల అధ్యయన టూర్లు. *తీర్మాణాలు* 1. స్పీకర్ మధుసూదనా చారి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గార్ల అనుమతితో ఆగస్టు 11, 12 తేదీల్లో, 2 రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టు టూర్ కు వెళ్లాలి. 2. గత సమావేశంలో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు గారి సూచన మేరకు జర్నలిస్టులకు ఓరియెంటేషన్ క్లాసులను నిర్వహించుకోవాలి. 3. ఇతర రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో సమావేశాలు, కార్యకలాపాల తీరు తెన్నులపై అధ్యయనం చేసేందుకు, మీడియా కమిటీ సభ్యుల టూర్. కమిటీ నిర్ణయాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని అసెంబ్లీ సెక్రటరీ హామీ ఇచ్చారు. సభ్యులు వ్యక్తంచేసిన అభిప్రాయాలను స్పీకర్ మధుసూదనా చారి, మంత్రి హరీష్ రావు గార్ల దృష్టికి తీసుకెళ్లి, వాళ్ళ మార్గనిర్దేశనంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది. సమావేశానికి సూరజ్ వి. భరద్వాజ్, ఎంఏ మాజిద్, వై. నాగేశ్వర రావు, మెండు శ్రీనివాస్, సోమగోపాల్, కేవీ రావు, మార్గం శ్రీనివాస్, మల్లేశం, వెలిజాల చంద్రశేఖర్, ఎక్కల్దేవి శ్రీనివాస్, కిరణ్, రాహుల్ లు హాజరయ్యారు. అటు అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డితో పాటు, ప్రోటోకాల్ విభాగం ఇతర సిబ్బంది, శాసనసభ రిపోర్టర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

RELATED NEWS

Comment