మద్రాసు హైకోర్టులో సినీ నటి కాజల్ కు ఎదురుదెబ్బ తగిలింది.

మద్రాసు హైకోర్టులో సినీ నటి కాజల్ కు ఎదురుదెబ్బ తగిలింది.

మద్రాసు హైకోర్టులో సినీ నటి కాజల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఓ కొబ్బరి నూనె తయారీ కంపెనీ యాడ్ కు సంబంధించి తన హక్కులపై సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది. కాపీరైట్‌ చట్టం ప్రకారం యాడ్‌లో నటించిన హీరోయిన్‌ ఒకసారి పారితోషికం పొందిన తర్వాత… దానిపై ఆమెను హక్కు ఉండదని, నిర్మాతగా కంపెనీకి 60 ఏళ్ల పాటు యాడ్‌ను ఉపయోగించుకునే హక్కు ఉంటుందని తెలిపారు జస్టిస్ టి.రవీంద్రన్. వివరాల్లోకి వెళితే.. 2008లో తాను నటించిన ప్రకటన ఒప్పందాన్ని ఆ కంపెనీ ఉల్లంఘించిందని, తనకు రూ.2.5 కోట్లు పరిహారం ఇప్పించాలని, ఆ యాడ్‌ను తిరిగి ప్రసారం చేయకుండా ఉత్తర్వులివ్వాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆ ఏడాది తర్వాత ఆ ప్రకటనను తిరిగి ప్రసారం చేసే హక్కు ఆ కంపెనీకి లేదని, కానీ ఆ కంపెనీ దానిని ఉల్లంఘించిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారించిన జస్టిస్‌ టి.రవీంద్రన్‌ సదరు కంపెనీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. కాజల్‌ పిటిషన్‌ను కొట్టేశారు.

RELATED NEWS

Comment