తుర్కపల్లిలో మొక్క నాటిన సీఎం కేసీఆర్‌

తుర్కపల్లిలో మొక్క నాటిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. మేడ్చల్‌ జిల్లశామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామంలో కేసీఆర్‌ బుధవారం మొక్క నాటారు. అనంతరంశామీర్‌పేట మండలం రాజీవ్‌ రహదారికి ఇరుపక్కల హకీంపేట నుంచి తుర్కపల్లి వరకు 5000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రిజోగు రామన్న, రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్‌, ఎంపీ మల్లారెడ్డి , ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, వివేకానంద, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.వి రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED NEWS

Comment