సీఎం కేసీఆర్‌ సోదరి కన్నుమూత

సీఎం కేసీఆర్‌ సోదరి కన్నుమూత

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన సోదరి లీలమ్మ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరి మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. మధ్యాహ్నం దిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. లీలమ్మ మృతిచెందినట్లు తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు.
 

RELATED NEWS

Comment