శనివారం ప్రధాని శ్రీ నరేంద్ర మోడితో సమావేశం కానున్నా  కేసీఆర్

శనివారం ప్రధాని శ్రీ నరేంద్ర మోడితో సమావేశం కానున్నా కేసీఆర్

సీఎం శ్రీ కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రధాని శ్రీ నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా కోరనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానికి సీఎం వివరించనున్నారు.

హైకోర్టు విభజన అంశంపై కూడా ప్రధానమంత్రితో చర్చిస్తారు. హైకోర్టును సత్వరం విభజించాల్సిందిగా ప్రధానిని కోరనున్నారు. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధుల సమకూర్చడం, సెక్రెటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం కేటాయించడం,

రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ చేయడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల, కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానమంత్రితో చర్చించనున్నారు.

RELATED NEWS

Comment