కుమారస్వామికి శుభాకాంక్షలు  తెలిపిన  కేసీఆర్

కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

కర్ణాటక సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు.

సీఎం కేసీఆర్ వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, వినోద్, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.

RELATED NEWS

Comment