అమ‌రావ‌తిలో నూత‌న గృహానికి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తుల భూమి పూజ‌.

అమ‌రావ‌తిలో నూత‌న గృహానికి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తుల భూమి పూజ‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌న‌సేన అధినేత శ్రీప‌వ‌న్‌క‌ళ్యాణ్ నూత‌నంగా నిర్మించ త‌ల‌పెట్టిన గృహానికి భూమి పూజ నిర్వ‌హించారు.. శ్రీప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అన్నా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తుల చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మం పూర్తి శాస్త్రోక్తంగా జ‌రిగింది.. సోమ‌వారం ఉద‌యం గం 8.26 నిమిషాల‌కు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హోమం  నిర్వ‌హించ‌డం ద్వారా పూజా కార్య‌క్ర‌మం  మొద‌లైంది.. అనంత‌రం ఉద‌యం గం 9.30 నిమిషాల‌కి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తులు ప్ర‌ధాన గృహానికి సంప్ర‌దాయ బ‌ద్దంగా శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి., పునాది రాయి వేశారు.. ఆ త‌ర్వాత 9.45 నిమిషాల‌కి ప్ర‌ధాన గృహానికి ఈశాన్యంలో నిర్మించ‌నున్న వ్య‌క్తిగ‌త‌ కార్యాల‌యానికి భూమి పూజ నిర్వ‌హించారు.. పూర్తి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రిగిన భూమి పూజ కార్య‌క్ర‌మం అనంత‌రం శ్రీప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తుల‌కి నూత‌న వ‌స్త్ర బ‌హూక‌ర‌ణ జ‌రిగింది.. చివ‌రిగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అన్నా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తులు గోపూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డంతో శంకుస్థాప‌న మ‌హోత్స‌వం ముగిసింది..


 ఖాజా టోల్ గేట్‌కి స‌మీపంలో జాతీయ ర‌హ‌దారి 5కి ద‌గ్గ‌ర్లో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇటీవ‌ల కొనుగోలు చేసిన రెండెక‌రాల విస్తీర్ణంలో ఈ గృహం నిర్మాణం కాబోతుంది.. రానున్న రోజుల్లో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇక్క‌డి నుంచే త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తారు..


RELATED NEWS

Comment