జనసేన పార్టీ సమన్వయ కర్తగా మదాసు గంగాధరం

జనసేన పార్టీ సమన్వయ కర్తగా మదాసు గంగాధరం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో తమ పోటీ చేస్తుంది అని ప్రకటించి పార్టీ బలోపేతం చేయడం పై దృష్టి సారించాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో తన పార్టీ గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించేలా కార్యకర్తలను నియమించుకున్నాడు. కాగా తాజాగా జనసేన పార్టీకి సమన్వయ కర్త గా కాంగ్రెస్ సీనియర్ నేత మదాసు గంగాధరాన్ని

నియమించాడు పవన్. ఈ విషయంను ఆ పార్టీ తెలియజెస్తూ.. ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆయన ఈ నెల 14న గుంటూరులో జరగబోవు జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయవంతం అయ్యేలా సమన్వయ బాధ్యతలు నిర్వహించనున్నారని తెలిపింది. జనసేన పార్టీ పెట్టి.. నాలుగేళ్ళు అయిన

సందర్భంగా గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే.. ఈ బహిరంగ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాడని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అంతేకాదు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పవన్ ఈ సభలో ఏమి చెప్పనున్నారు అనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది

RELATED NEWS

Comment