మహాకూటమికి కోదండ రాం రాం...!!

మహాకూటమికి కోదండ రాం రాం...!!

మహాకూటమికి తెలంగాణ జనసమితి గుడ్‌ బై చెప్పనుందా..? కూటమిలో తాము అడిగిన అన్ని సీట్లు ఇవ్వకపోతే సంచలన నిర్ణయాలు తప్పవని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండ రాం మంగళవారం కూటమిలోని మిగిలిన పార్టీల నేతలకు 48 గంటల డెడ్‌లైన్‌ విధించారు.. ఈ గడువు గురువారంతో ముగియనుంది. మరోవైపు, గడువు సమయం ముంచుకొస్తున్నా కాంగ్రెస్‌, టీటీడీపీ, సీపీఐ నేతలు మాత్రం కోదండ రాం కండిషన్స్‌పై ఎలాంటి భేటీ నిర్వహించలేదు. ఇటు, కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ తమ పార్టీలోని సీనియర్‌ నేతల టికెట్‌లను ప్రకటించే పనిలో బిజీగా ఉంది. కూటమిలో మిగిలిన టీటీడీపీ, సీపీఐ కాంగ్రెస్‌ టికెట్‌లు ప్రకటించిన తర్వాత జరగాల్సిన పరిణామాలపై ఫోకస్‌ పెడుతున్నారు.. 
 
మహాకూటమిలో తాము కొనసాగాలంటే తమ పార్టీ టీజేఎస్‌కి మినిమమ్‌ 25 నుండి 30 టికెట్‌లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు కోదండ రాం.. ఆ పార్టీకి ఉన్న బలం, బలగం  దృష్ట్యా ఇది సాధ్యం కాని పని అని, తాము 5-10 లోపు స్థానాలు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీ నేతలు కోదండరామ్‌కి వివరిస్తున్నారు.. మరోవైపు, తమకు 20-25 సీట్లు కావాలని షరతులు పెడుతోంది టీటీడీపీ.. ఆ రేంజ్‌లో కష్టమని చెబుతోన్న కాంగ్రెస్‌ 15తో సర్దుకోవాలని ఫిగర్‌ ఇస్తోంది.. మొత్తం 119 స్థానాలలో తాము మెజారిటీ సీట్లలో పోటీ చేస్తేనే కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు.. 
 
కేసీఆర్‌ విధిస్తున్న షరతులకు కాంగ్రెస్‌ తలొగ్గేలా కనిపించడం లేదు.. ఇటు, మహాకూటమిలోని ఇతర పార్టీల నేతలు సైతం లైట్‌ తీసుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్‌ కాదంటే వెంటనే బీజేపీ తలుపు తట్టడానికి టీజేఎస్‌ రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాషాయదళం అధినేత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు.. ఇదే సరైన సమయంగా భావించిన కోదండరామ్‌ మహాకూటమిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం.. మరి, మహాకూటమి పొద్దు పొడవకముందే పొత్తు వికటిస్తుందా...? లేదా..? అనేది తేలడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.. 

RELATED NEWS

Comment