మీడియాకు మెరుగైన వసతులు కల్పించండి- మంత్రి హరీష్ రావు

మీడియాకు మెరుగైన వసతులు కల్పించండి- మంత్రి హరీష్ రావు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మీడియా అడ్వైజారీ కమిటీ సమావేశం జరిగింది. కవరేజీకి వచ్చే మీడియా ప్రతినిధులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చ జరిగింది. సమావేశానికి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షత వహించారు. మరో మంత్రి (పశుసంవర్ధక శాఖ) తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కమిటీ చైర్మన్ సూరజ్ వి. భరద్వాజ్, శాసనసభ కార్యదర్శి డా. వేదాంతం నర్సింహా చార్యులు మీడియా ప్రతినిధుల దరఖాస్తులను పరిశీలించి ఈ సమావేశాల కోసం తాత్కాలిక పాస్ ల జారీ ప్రక్రియ పూర్తి చేశారు.

అటు మంత్రి హరీష్ రావు కమిటీని ఉద్దేశించి మాట్లాడారు. మీడియాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కార్యదర్శిని ఆదేశించారు. సమావేశాల సమయాలలో సంబంధం లేకుండా మొదటి రోజు నుంచి సమావేశాలు పూర్తయ్యేవరకు సభ్యులకు భోజన సదుపాయాలు కల్పించాలని సూచించారు. సభ్యులు లేవనెత్తిన ఇతర సమస్యలకు సైతం సానుకూలంగా స్పందించారు. ఆమేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

సమావేశాలు సజావుగా సాగడానికి మీడియా మిత్రులు సహకరించాలని మంత్రి హరీష్ రావు కోరారు

RELATED NEWS

Comment