నర్సరీ పెంపకందారులను రైతులుగా గుర్తించాలి: శ్రీ పవన్ కళ్యాణ్

  నర్సరీ పెంపకందారులను రైతులుగా గుర్తించాలి: శ్రీ పవన్ కళ్యాణ్

కడియం నర్సరీ రైతులను రాష్ట్ర ప్రభుత్వం రక్షించి అండగా నిలవాలని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ కోరారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన నర్సరీ రైతులు కొందరు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు పార్టీ పరిపాలన కార్యాలయంలో కలసి వారి సమస్యలను వివరించారు.తమను రైతులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడంలేదని, దీనివల్ల తమను వ్యాపారస్తుల్లా పరిగణిస్తూ వివిధ శాఖల అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.దీనితోపాటు ఉచిత విద్యుత్ దక్కకుండా పోయిందని వివరించారు.ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ విభిన్న మొక్కలను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకువస్తున్న కడియం నర్సరీ పెంపకందారులను తక్షణం రైతులుగా గుర్తించి వారికి ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.రైతుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వారికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

 

RELATED NEWS

Comment