గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. ఆగస్టు 15న ప్రారంభమయ్యే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆదివారం భేటీ అయిన సీఎం కేసీఆర్ హరితహారం, తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపైనా వీరిద్దరూ చర్చించారు. ఇటీవలి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ, తెరాస వైఖరి, ప్రధాని వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

RELATED NEWS

Comment