అమ‌రావ‌తిలో 50 ఎక‌రాల్లో మెగా శిల్పారామం

అమ‌రావ‌తిలో 50 ఎక‌రాల్లో మెగా శిల్పారామం

 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రికొత్త రాజ‌ధాని అమ‌రావ‌తిలో మెగా శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి భూమా అఖిల ప్రియ శాస‌న స‌భ‌లో వివ‌రించారు. దీనికి 50 ఎక‌రాలు కావాల‌ని ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయ‌ని, దీనిని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆస‌క్తితో ఉన్నార‌న్నారు. స్థ‌లం కేటాయించాల‌ని సిఆర్డిఎ క‌మిష‌న‌ర్ కు ఆదేశాలిచ్చార‌ని, ఒక మాస్ట‌ర్ ప్లాన్ కూడా త‌యారైంద‌న్నారు. ఇందులో ట్ర‌యినింగ్ సెంట‌ర్, క‌ళాకారుల‌కు డార్మెట‌రీలు, హాస్ట‌ళ్ళు ఒక యాంపీ థియోట‌ర్, పుడ్ కోర్టు వంటివి ఉంటాయ‌న్నారు. ఇందులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌తో పాటు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేస్తున్నామ‌ని మంత్రి అఖిల ప్రియ తెలిపారు. మెగా శిల్పారామంలో శిక్ష‌ణ ఇచ్చేందుకు  నేష‌న‌ల్ ఇనిస్ట్ట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ డిజైన్. ఎన్.ఐ.టిల‌తో ఒప్పందాలు కూడా చేసుకుంటామ‌ని చెప్పారు

RELATED NEWS

Comment