మెగాస్టార్ ఢీ అంటోన్న కన్నడ స్టార్

మెగాస్టార్ ఢీ అంటోన్న కన్నడ స్టార్

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు అంతా సెట్ అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని వెదికారు. ఒక దశలో ఐశ్వర్యరాయ్ ఫైనల్ అయిందన్నారు కూడా. కానీ ఆమె 9కోట్ల రెమ్యూనరేషన్ అడగడంతో వద్దనుకున్నారు. కానీ అమితాబ్ బచ్చన్ ఓ పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అలాగే హీరోయిన్ గా నయనతార కూడా ఒప్పేసుకుందనే అంటున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ సుదీప్ నటిస్తున్నాడనేది లేటెస్ట్ రూమర్..
ఈగ సినిమాతో తనే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుని టాలీవుడ్ మనసు దోచిన సుదీప్.. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో ఓ చిన్న పాత్రలో మెరిశాడు. ఇక ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ తో ఢీ అనేందుకు ఒప్పుకున్నాడంటున్నారు. అయితే సుదీప్ కు సంబంధించిన వార్తలపై అఫీషియల్ క్లారిటీ లేదు. ఇక దేశభక్తికి సంబంధించిన కథ కాబట్టి.. ఈ నెల 15న ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. కానీ కొందరు మాత్రం చిరు బర్త్ డే అయిన 22నే ప్రారంభం అవుతుందంటున్నారు. మరి అప్పటి వరకైనా ఉయ్యాలవాడలో నటించే వారి విషయంలో ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.

RELATED NEWS

Comment