నా పేరు సూర్య సక్సెస్ సెలెబ్రేషన్స్

నా పేరు సూర్య సక్సెస్ సెలెబ్రేషన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం విడుదలై సూపర్ డూపర్ సక్సెస్ తో దూసుకెళ్తోంది. భారీ కలెక్షన్లతో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సకెస్స్ సంబరాల్ని గ్రాండ్ లెవల్ లో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరౌతుండడం విశేషం. పవర్ స్టార్ , స్టైలిష్ స్టార్ ఒకే వేదికపైకి వస్తుండడంతో ఫంక్షన్ ను భారీస్థాయిలో చేయనున్నారు. ఈనెల 10వ తేదీన ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ హైదరాబాద్ లో జరుగుతాయి. ఈ సందర్భంగా....

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం మనందరం గర్వపడే చిత్రం. చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఉప్పొంగిపోయే చిత్రం. మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ ఈ సినిమాను ప్రధాన బలం. వక్కంతం వంశీ దర్శకుడిగా తన స్టామినా చూపించి సక్సెస్ సాధించాడు. ప్రేక్షకులంతా ముక్తకంఠంతో భారీ కలెక్షన్స్ దిశగా తీసుకెళ్తున్నారు. అందుకే ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేశాం. ఈనెల 10వ తేదీన హైదరాబాద్ లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. బన్నీ అంటే అమితంగా ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా రానున్నారు. పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ ఒకే వేదిక మీదకు వస్తే అభిమానుల్లో ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాం. అని అన్నారు.

RELATED NEWS

Comment