నాగార్జున విశ్వ‌విద్యాల‌యంఎంఎ పొలిటిక‌ల్ సైన్స్ ద‌ర‌ఖాస్తు చేస్తున్న మంత్రి

నాగార్జున విశ్వ‌విద్యాల‌యంఎంఎ పొలిటిక‌ల్ సైన్స్ ద‌ర‌ఖాస్తు చేస్తున్న మంత్రి

అఖిల ప్రియ @ నాగార్జున విశ్వ‌విద్యాల‌యంఎంఎ పొలిటిక‌ల్ సైన్స్ ద‌ర‌ఖాస్తు చేస్తున్న మంత్రి ఎంబిఎ చేశా... ఇపుడు పొలిటిక‌ల్ సైన్స్ చ‌దువుతా: మ‌ంత్రి భూమా అఖిల ప్రియ‌
 
నాగార్జున విశ్వ‌విద్యాల‌యం:  మీలో రాజ‌కీయాల్లోకి ఎంత మంది రావాల‌నుకుంటున్నారు? అంటూ నాగార్జున విశ్వ‌విద్యాల‌యం విద్యార్థినుల‌ను మంత్రి భూమా అఖిల ప్రియ ప్ర‌శ్నించారు. మ‌హిళ ఏ రంగంలో అయినా ఎద‌గ‌డానికి ఏదీ అడ్డంకి కాద‌ని, అన్ని స‌వాళ్ళ‌ను అధిగమించి ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ఎంబీఎ చ‌దివిన తాను ఇపుడు నాగార్జున యూనివ‌ర్సిటీలో ఎంఏ పొలిటిక‌ల్ చేస్తాన‌ని మంత్రి త‌న అభిమ‌తాన్ని వెల్ల‌డించారు. దీనితో వెంట‌నే వైస్ ఛాన్సిల‌ర్ ఆమెకు ఎం.ఎ. దూర‌విద్య ద‌ర‌ఖాస్తును అందించారు. నాగార్జున విశ్వ‌విద్యాల‌యంలో మంగ‌ళ‌వారం మ‌హిళాదినోత్స‌వ క్రీడాపోటీల్లో బ‌హుమ‌తుల ప్ర‌ధాన కార్య‌క్ర‌మంలో మంత్రి అఖిల ప్రియ పాల్గొన్నారు. టి.ఎన్.ఎస్.ఎఫ్. ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌భ‌లో మంత్రి విద్యార్థినుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ రోజుల్లో అమ్మాయిలు దేనికీ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని, మ‌గ‌వారితో స‌మానంగా రాణించే ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చెప్పారు. నాగార్జున విశ్వ‌విద్యాల‌యం నిర్వ‌హణ చ‌క్క‌గా ఉంద‌ని, త‌న‌కు కూడా ఈ యూనివ‌ర్సిటీలో చ‌ద‌వాల‌నిపిస్తోంద‌ని అఖిల‌ప్రియ అన్నారు. ఇక్క‌డ ఎం.ఎ. పొలిటిక‌ల్ సైన్స్ దూర విద్య‌లో చ‌దువుతాన‌ని చెప్ప‌గానే, వెంట‌నే స్పందించిన నాగార్జున యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సిల‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ ఆమెకు వేదిక‌పైనే ద‌ర‌ఖాస్తు అందించారు. 
 
 
రైట‌ప్:  ఏపీ టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఎం.ఎ. పొలిటిక‌ల్ సైన్స్ ద‌ర‌ఖాస్తును అందిస్తున్న నాగార్జున యూనివ‌ర్సిటీ వీసీ రాజేంద్ర‌ప్ర‌సాద్

RELATED NEWS

Comment