‘ఆ నలుగురు’తో నలిగిపోతోన్న నాని ..?

‘ఆ నలుగురు’తో నలిగిపోతోన్న నాని ..?

గత మూడేళ్లుగా అపజయం ఎరుగకుండా దూసుకుపోతోన్న ఏకైక స్టార్ నాని. ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వెళుతోన్న నానిని చూసి చాలామంది బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు కుళ్లుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. స్టోరీ సెలక్షన్ లోనే కాదు.. డైరెక్టర్, బ్యానర్ విషయాల్లోనూ నాని సెలక్షన్ సూపర్ అనిపిస్తోంది. ఈ యేడాది ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ తో ఊపుమీదున్న నానికి ఇప్పుడు ఓ పేద్ద కష్టం వచ్చి పడిందట. టాలీవుడ్ లో ఉన్న కొందరు బడా నిర్మాతలు నానిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారట. ఆ ఒత్తిడి తట్టుకోలేక నాని బాగా ఇబ్బంది పడుతున్నాడని టాక్..
నాని సాధిస్తోన్న విజయాలు చూసి.. ఒకప్పుడు పెద్ద స్టార్స్ కే పరిమితం అనుకున్న కొందరు పేద్ద నిర్మాతలు ఇప్పుడు నాని వెంట పడుతున్నారట. తమ బ్యానర్ లో సినిమా చేయాలని ఒత్తిడి తెస్తున్నారట. పోనీ ఒకే చెబుదాం అనుకునేలోపే.. పెద్ద అమౌంట్ కోట్ చేస్తూ రెండు మూడు సినిమాలకు సైన్ చేయాలని కండీషన్స్ పెడుతున్నారట. దీంతో ఒకే బ్యానర్ లో రెండు మూడు సినిమాలు చేస్తే తనకే లాస్ అని సన్నిహితులు చెబుతుండటంతో ఆగిపోతున్నాడట. కానీ అవతలి వాళ్లు మాత్రం తమ ‘పెద్దరికం’నానిని మరీ ఇబ్బంది పెడుతున్నారనే వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. దీంతో ఇప్పటికే కమిట్ అయి ఉన్న ప్రొడ్యూసర్స్ నాని ఏ నిర్ణయం తీసుకుంటాడా అని భయపడుతున్నారట. ఏదేమైనా సక్సెస్ వెంట పరుగులు తీయడమే కాదు.. సక్సెస్ కోసం పరువులు కూడా తీసే ఇండస్ట్రీ ఇది. సో.. జస్ట్ బికేర్ ఫుల్ నానీ...

RELATED NEWS

Comment