యంగ్ టైగర్ లో రెండో యాంగిల్ తెలిసేది అప్పుడే

యంగ్ టైగర్ లో రెండో యాంగిల్ తెలిసేది అప్పుడే

జైలవకుశ సెకండ్ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది. జై ఇంట్రడక్షన్ టీజర్ తో ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ పాస్ చేస్తోన్న జూ.ఎన్టీఆర్, లవకుమార్ టీజర్ తో ఆ అంచనాలను మరింత పెంచడానికి రెడీ అయిపోయాడు. జై టీజర్ తో పెరిగిన అంచనాలను బీట్ చేసేలా డైరెక్టర్ బాబీ, తారక్ అండ్ బ్యాచ్ రెడీ చేసిన లవ టీజర్ ఈనెల 7న రాబోతోంది. రావణాసురుడిని చంపాలంటే సముద్రం దాటాల..నాలాంటోన్ని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలంటూ జై.. వెబ్ దునియాలో ఓ సునామి సృష్టిస్తోంటే, ఆ మేనియాని మరింత పెంచడానికి ఇప్పుడు లవకుమార్ వస్తున్నాడు.
జూ.ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేస్తోన్న ఈసినిమాలో జై నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంటే, లవ-కుశ ఇద్దరు పాజిటివిటీతో హీరోయిజం చూపిస్తారట. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కళ్యాణ్ రామ్ 100కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈసినిమా హాలివుడ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. ప్రాస్థటిక్ మేకప్ ఆర్టిస్ట్ వేన్స్ హార్ట్ వెల్ తారక్ ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించబోతున్నాడట. దీంతో లవకుమార్ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యగానే ఈ గెటప్ ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగిపోతోంది.
లవ-కుశ క్యారెక్టర్లు రెండూ హీరోయిజం చూపించే పాత్రలు కాబట్టి, ఈ రెండింటిలోనూ వేరియేషన్స్ ఉండొచ్చు. మేకోవర్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు వైవిధ్యం ఉండొచ్చు. అని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. ఇక జూ.ఎన్టీఆర్ తో రాశి ఖన్నా, నివిదా థామస్ జోడీ కట్టిన ఈసినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో, జైవలవకుశను తెలుగుతోపాటు తమిళ్,మలయాళంలోనూ రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడు నిర్మాత.

RELATED NEWS

Comment